Home » మద్యం తాగేటప్పుడు.. ఈ పొరపాట్లను అస్సలు చెయ్యకండి..!

మద్యం తాగేటప్పుడు.. ఈ పొరపాట్లను అస్సలు చెయ్యకండి..!

by Sravya
Ad

చాలామందికి చెడు అలవాట్లు ఉంటూ ఉంటాయి. మద్యం అలవాటు చాలామందికి ఉంటుంది. మద్యం తాగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మద్యం తాగేటప్పుడు ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదు మద్యం తీసుకునే వాళ్ళు ఈ ఆహార పదార్థాలను కనుక తీసుకున్నట్లయితే గ్యాస్, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం అలానే గుండెలో మంట ఇటువంటి సమస్యలు కలుగుతాయి. మద్యంతో పాటుగా ఈ ఆహార పదార్థాలను తీసుకోకుండా చూసుకోవాలి మద్యం తాగేటప్పుడు ఏ ఆహార పదార్థాలని తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.. మద్యం తాగేటప్పుడు చాక్లెట్స్ ని తీసుకోకూడదు. తీసుకుంటే మైగ్రేన్, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి అలానే మద్యం తాగుతున్న వాళ్ళు మధ్యలో స్టఫ్ గా పిజ్జా ని తీసుకోకూడదు పిజ్జా లో ఉండే కొవ్వు పదార్థాలు ఆల్కహాల్తో కలిసి తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి.

Advertisement

Advertisement

ఫ్రెంచ్ ఫ్రైస్ ని కూడా మధ్యలోకి స్టఫ్గా తీసుకోకూడదు. వీటి లో ఎక్కువ సాల్ట్ కొవ్వు ఉంటుంది. సో వీటిని కూడా మద్యంతో పాటు తీసుకుంటే ఇబ్బంది పడాలి. ఇలా తీసుకోవడం వలన రక్తపోటు పెరగడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అలానే మద్యం తీసుకునేటప్పుడు చాలా మంది స్టఫ్ గా నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. అయితే మద్యానికి స్టఫ్ గా తినే పదార్థాల్లో కెఫిన్ ఉంటే కూడా హాని చేస్తుంది. కెఫిన్ వుండే పానీయాలు ఆల్కహాల్ తో కలిసి తీసుకున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. అలానే ఆందోళన వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

కాబట్టి కెఫిన్ ఉండే వాటిని తీసుకోవద్దు. కొంతమంది స్టఫ్ గా బీన్స్ కాయ ధాన్యాలు వంటివి తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇవి తీసుకోవడం వలన ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది మద్యంతో పాటు తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. పాల ఉత్పత్తుల్ని కూడా తీసుకోకూడదు. మద్యం లో స్టఫ్ గా పాల ఉత్పత్తులను తీసుకుంటే ఆల్కహాల్తో ఇవి కలిసినప్పుడు కడుపు ఉబ్బరం అజీర్తి వంటి ఇబ్బందులు కలుగుతాయి. సో అసలు మద్యం తీసుకునేటప్పుడు ఈ ఆహార పదార్థాలను తీసుకోవద్దు మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading