సాధారణంగా ఒక సినిమా కోసం ఎంతో మంది శ్రమ పడితేనే ప్రేక్షకుల ముందుకు ఓ మంచి సినిమా వస్తుంది. సినిమాల్లో ప్రధానంగా హీరోలు ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, రిస్కీ షాట్స్ చేయడం చూసి ఆడియన్స్ విజిల్స్ వేస్తూ హంగామా చేయడం మనం చూస్తూనే ఉంటాం. వాస్తవానికి ఆ సీన్స్ అన్ని హీరోలే చేశారని మనం నమ్ముతుంటాం. కానీ సినిమాల్లో ఆ సీన్స్ చేయడానికి హీరోలకు డూప్స్ ఉంటారు. కొంచెం రిస్క్ అనిపించే షాట్స్ ను వారితో చేయిస్తారట. అలా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి కూడా ఓ డూప్ ఉన్నాడు. అతని పేరు కిరణ్ రాజ్.
Advertisement
చాలా సినిమాల్లో ప్రభాస్ డూప్ గా కనిపించి మెప్పించాడు కిరణ్ రాజ్. బాహుబలి, సాహో, సలార్ వంటి సినిమాల్లో నటించాడు. తాజాగా కిరణ్ రాజ్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే.? ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి. ఈ చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయని.. ఈ మూవీలో కూడా చాలా సీన్స్ కోసం ప్రభాస్ డూప్ ను వాడారట. ఈ నేపథ్యంలో కిరణ్ రాజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Advertisement
ప్రభాస్ డూప్ గా చేయడానికి కిరణ్ రాజ్ ఒక్క రోజు కి రూ.30 లక్షల వరకు తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకు అంటే..? డూప్ అంటే రోజుకి లక్ష తీసుకోవడమే ఎక్కువ అలాంటిది.. ప్రభాస్ డూప్ ఒక్క రోజుకు ఏకంగా రూ.30లక్షలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలా చూసుకుంటే ఒక్కో సినిమాకి పది రోజులు పని చేసినా రూ.3కోట్లు అన్నమాట. ఇది చాలా మంది స్టార్ హీరోల కంటే చాలా ఎక్కువనే. అందుకే ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : SUNDARAM MASTER REVIEW : సుందరం మాస్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?