Home » లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలంటే.. ఇలా చెయ్యండి…!

లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలంటే.. ఇలా చెయ్యండి…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే ఒక్కొక్కసారి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చూద్దాం.. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని అనుకుంటారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఏ సమస్య ఉండదు. ముఖ్యంగా ధనానికి లోటు ఉండదు. పవిత్ర వృక్షాల్లో ఒకటైన మారేడు శివుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకులతో శివుడిని ఆరాధించడం వలన మన కోరికలు నెరవేరుతాయి. మారేడు లోని మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడు కొలువై ఉంటారు. మారేడు దళం శక్తి జ్ఞాన శక్తికి సంకేతం.

Advertisement

Advertisement

ఈ మూడు కూడా శివ స్వరూపం, శివ సహోదరి అయిన మహాలక్ష్మి దేవి హృదయం నుండి మారేడు దళం ఆవిర్భవించడంతోనే శివుడికి ఆ దళం ఎంతో ఇష్టం అని పురాణాలు చెబుతున్నాయి. మారేడు వృక్షం చుట్టూ భక్తి తో ప్రదక్షిణాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది భక్తి తో మారేడు వృక్షాన్ని తాగితే మన కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మారేడు ఆకుని పర్సులో కాని బీరువాలో కానీ డబ్బులు దాచుకునే డబ్బాలో కానీ పెట్టాలని పండితులు చెప్తున్నారు.

ఇలా మారేడు ఆకుల్ని ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ఇంట ఎప్పుడూ కొలువై ఉంటుంది. జేబు లో కూడా మారేడు దళాన్ని పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా డబ్బులు స్థిరంగా ఉంటాయి. రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే బాధలు అన్నీ తొలగిపోతాయి. సూర్యుడు నుండి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకి పూజ చేస్తే సిరిసంపదలు పెరుగుతాయి. మహాలక్ష్మి దేవి ఇంట కొలువై ఉంటుంది ఐశ్వర్యవంతులు అవ్వచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading