Home » ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ మధ్య దూరం పెరగడానికి గుమ్మడి ఓ కారణం ఎలా అంటే

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ మధ్య దూరం పెరగడానికి గుమ్మడి ఓ కారణం ఎలా అంటే

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, నాగేశ్వరరావు రెండు కళ్లలాంటి వారు. అన్నదమ్ముల్లా ఎంతో అన్యోన్యంగా ఉండే వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. అలా ఎందుకు జరిగిందంటే..? సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తరలిరావాలని అక్కినేని నాగేశ్వరరావు లేదు. పరిశ్రమ మద్రాస్ లోనే ఉండాలి. సినీ పరిశ్రమ కోసమే ఎంతో డబ్బు వెచ్చించి స్టూడియోలు కట్టారు. పరిశ్రమ హైదరాబాద్ వెళ్లిపోతే అక్కడి వాళ్లు ఇబ్బంది పడతారని ఎన్టీఆర్ అనేవారు.]

nageswaro-rao

Advertisement

 

ఎలాగైతే ఏఎన్నార్ హైదరాబాద్ వచ్చేశారు. సినీ పరిశ్రమను హైదరాబాద్ కి తీసుకొచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారు.  ఇది తెలిసిన ఎన్టీఆర్ ఆగ్రహించారు. తనను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. వరద బాధితుల కోసం ఎన్టీఆర్ జోలె పట్టారు. ఆ సమయంలో తనకు చెప్పారా అని ఏఎన్నార్ ఎదురు ప్రశ్నించారు. వరద బాధితుల కోసం ఎన్టీఆర్ జోలె పట్టారు. ఆ సమయంలో తనకు చెప్పారా అని ఏఎన్నార్ ఎదురు ప్రశ్నించారు. ఈ వాగ్వాదం ప్రత్యక్షంగా జరిగేది కాదు. వీరిద్దరికీ ఆప్తుడు అయిన గుమ్మడి వెంకటేశ్వరరావు ఇద్దరి మధ్య వారధిగా ఉండేవారు. అక్కడి మాటలు ఇక్కడికీ ఇక్కడి మాటలు అక్కడికీ మోసేవారు. అలా వారి మధ్య దూరం మరింత పెరిగింది. అందుకు గుమ్మడి కూడా ఓ కారణం అని భావించిన ఎన్టీఆర్ ఆయనను దూరం పెట్టారు. ఓ నాలుగైదేళ్లు అతనితో మాట్లాడలేదు.

Advertisement

 

గుమ్మడి ఇంట్లో ఏ శుభకార్య జరిగినా తప్పనిసరిగా హాజరయ్యే ఎన్టీఆర్.. వారి అమ్మాయి పెళ్లికి కూడా హాజరు కాలేదు. గుమ్మడిని అలా దూరం పెట్టడానికి అదొక్కటే కారణం కాదు.. గతంలో కూడా ఎన్టీఆర్, గుమ్మడి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాలలో నటించిన తరువాత సొంత బ్యానర్ పెట్టి పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు వంటి సినిమాలను నిర్మించారు. ఈ సినిమాలకు మంచి పేరే వచ్చినా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఆ తరువాత 1965లో గంగాధరరావు అనే నిర్మాత కీలు బొమ్మలు అనే ఆఫ్ బీట్ సినిమా తీశారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ వంటి వారు ప్రత్యేకంగా చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది. స్టేజ్ మీదే గుమ్మడికి కౌంటర్ ఇచ్చారు ఎన్టీఆర్. రెండు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాం. మేము ఇంకా నష్టపోవాలని గుమ్మడి కోరుకుంటున్నట్టున్నారు. మీ దగ్గర డబ్బు ఉంటే అలాంటి సినిమాలు తీయండి అని సలహా ఇచ్చారు. దానికి వివరణ ఇచ్చేందుకు గుమ్మడి ప్రయత్నించినా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. చాలా కాలానికి పరిశ్రమను తరలించే విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్యలో గుమ్మడి ఇరుక్కున్నారు. ఒకసారి అనుకోకుండా ఎన్టీఆర్, ఏఎన్నార్ కలుసుకున్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అగాధం పెరగడానికి కారణం గుమ్మడినేనని తెలుసుకున్నారు. ఇద్దరూ శాంతించారు. ఆ తరువాత గుమ్మడి పై కోపం తగ్గడంతో తాను చేసిన సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు గుమ్మడిని పిలిచారు.

Also Read : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2024 విజేతలు వీరే..!

Visitors Are Also Reading