Home » భారత్, యూఏఈ జిందాబాద్.. దుబాయ్ లో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్, యూఏఈ జిందాబాద్.. దుబాయ్ లో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Anji
Ad

నరేంద్ర మోడీ మంగళవారం రెండు రోజుల పర్యటన కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోడీకి సాదర స్వాగతం పలికారు అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఇద్దరు నేతలు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ వందనం అందించారు. ఇరువురు నేతలు విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించారు. కొత్త సహకార రంగాలపై చర్చించారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Advertisement

అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో మొదట తెలుగు, తమిళం మళయాళంలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. 30 ఏళ్లలో యూఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానే అని చెప్పారు. ఇక్కడున్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు. యూఏఈ అత్యున్నత పురష్కారం తనకు లభించిందంటే అది మీ వల్లే అని భారతీయులపై ప్రశంసలు కురిపించారు. యూఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినపుడు ఆయనను గౌరవించామని గుర్తు చేశారు.

Advertisement

 

దేశంలో మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం నిర్మాణానికి భూమిని మంజూరు చేయడంలో మద్దతు, దయ చూపినందుకు అల్ నహ్యాన్ కు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం అబుదాబిలో బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ  మందిర్‌ను మోడీ ప్రారంభించారు. దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో మోదీ గౌరవ అతిథిగా పాల్గొంటారు. అక్కడ ఆయన కీలక ప్రసంగం చేస్తారు. మోడీ UAE పర్యటన 2015 నుంచి ఇది ఏడవసారి. గత ఎనిమిది నెలల్లో ఇది అతని మూడవ పర్యటన కావడం గమనార్హం.

Also Read :   కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజు లాంచ్ కావడం లేదు: నరేంద్ర మోడీ

 

Visitors Are Also Reading