పరమశివుడు అనుగ్రహాన్ని పొందాలంటే పూజ చేసేటప్పుడు ఇలా చేయడం మంచిది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. హిందూమతంలో ఎక్కువగా పూజింపబడే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు నవగ్రహాలని కూడా శివుడు పరిపాలిస్తాడు. శివుడిని పూజించడం వలన గ్రహాల సమస్యలు కూడా పోతాయి. శివపురాణం ప్రకారం ”ఓం నమశ్శివాయ” అనే మంత్రం శివుని ప్రభావితమైన మంత్రమని చెప్పొచ్చు.
Advertisement
Advertisement
ఈ మంత్రాన్ని జపిస్తే రోగాల నుండి బయటపడవచ్చు మనం కోరుకున్నది కూడా నెరవేరుతుంది. చాలామంది కోరికలు నెరవేరక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇలా జపిస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. అలానే ”ఓం నమో భగవతే రుద్రాయ నమః” అని శివుని రుద్ర మంత్రం చదివితే కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వలన కోరికలు నెరవేరుతాయిట. సోమవారం నాడు ఈ రెండు మంత్రాలను జపించడం వలన మంచి ఫలితం ఉంటుంది ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తుంది కాబట్టి ఇలా మీరు పరమశివుడ్ని పూజించడం వలన అనుకున్నవి నెరవేరుతాయి సంతోషంగా ఉండవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!