సీఎం రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను వ్యక్తిగతంగా తిడుతున్నారని చెప్పారు. అలానే బీఆర్ఎస్ పార్టీని కూడా తిడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకి ఇది పద్ధతి కాదని అన్నారు. నన్ను నా పార్టీని టచ్ చేయడం సీఎం రేవంత్ వలన కాదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
Advertisement
తెలంగాణలో సీఎం రేవంత్ కంటే హేమా హేమీలని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన చరిత్ర తనదని రేవంత్ ఉడత ఊపులకు తాను భయపడనని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. దీంతో పాటుగా కృష్ణ జలాల పై మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులని తమకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. కానీ ప్రాజెక్టులనే అప్పగించే ప్రసక్తే లేదని చెప్పామని చెప్పారు తమకి ప్రాజెక్టులు అని అప్పగించుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నోటిఫై చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ భయపడకుండా ప్రాజెక్టులను ఇవ్వమని అవసరమైతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకోమని చెప్పినట్లు కేసీఆర్ చెప్పారు. ఉద్యమం నుండి వచ్చామని తెలంగాణకి అన్యాయం చేస్తే అసలు ఊరుకోమని కేసీఆర్ చెప్పారు.
Advertisement
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!