హిందువులు ఎవరైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా కూడా డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి విగ్రహాలని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే శివాలయంలో మనం గమనించినట్లయితే ఇలా ఉండదు. శివాలయంలో నందికొమ్ముల నుండి శివుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఆలయంలోకి వెళ్లి లింగ ని దర్శనం చేసుకుని వస్తారు అయితే ఎందుకు శివుని దర్శనం చేసుకునే ముందు నంది కొమ్ముల మధ్యలో నుండి శివుడిని చూడాలి….? దాని వెనుక కారణం ఏంటి..?
Advertisement
Advertisement
త్రిమూర్తులు లో శివుడు ఒకరు కేవలం ఆయనకి మాత్రమే విగ్రహరూపం ఉండదు ఆయన్ని లింగ రూపంలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటాము. శివుడు లయకారుడు ఆయన మూడవ కన్ను తెరిస్తే సమస్తము కూడా అంతమైపోతుంది. అంతటి శక్తి ఆయన మూడో కన్నుకి ఉంది ముందుగా నంది కొమ్ముల నుండి చూసి లింగ దర్శనం చేసుకున్న తర్వాతే శివుని దర్శనం చేసుకోవాలి అలాంటి శక్తి శక్తివంతుల్ని నేరుగా దర్శించుకోకూడదు. కాబట్టి ఇలా మనం శివుని దర్శనం చేసుకోవాలి ఇలా శివుడిని దర్శనం చేసుకుని మనం కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!