కేంద్రంలో అధికారంలోకి వస్తేనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారని.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. శుక్రవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ లో చెరుకు బాలయ్య గార్డెన్స్ లో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. అయితే కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక పథకాలని అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వీలవుతుందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తుంటే హామీలు అమలుపరచడం నా వల్ల కాదని అర్థమవుతుందని అన్నారు.
Advertisement
Advertisement
అమలు చేయలేమని తెలిసి కూడా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పార్లమెంట్లకి పంపించండి. అమలు చేస్తామని చెప్పే ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కేటీఆర్ అన్నారు. లక్షల లోన్ తీసుకోమన్నారు నేను వచ్చి రుణమాఫీ చేస్తా అన్నారు. అత్తలకి మాత్రమే పింఛన ఆ కోడళ్ళకి మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఇస్తామన్నారు. కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు 2500 కోసం వేచి చూస్తున్నారని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!