భారతీయ సనాతన ధర్మంలో శంఖానికి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మన పురాణాలలో మహావిష్ణువు శంఖచక్రాలని ధరించడం, శివుడు కూడా అనేక సందర్భాల్లో శంఖాన్ని ధరించడం మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో శంఖాన్ని పెట్టుకుంటారు శంఖం ఇంట్లో ఉంటే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతి రోజూ శంఖాన్ని మోగించడం వలన శ్వాసకి సంబంధించిన రోగాలు నయం అవుతాయి. శంఖాన్ని ఊదడం వలన క్రిమి కీటకాలు దూరం అవుతాయి.
శంఖం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలానే ఆధ్యాత్మికపరంగా కూడా ప్రయోజనాలని పొందవచ్చు. అయితే శంఖాన్ని ఎప్పుడు పూజించాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. శంఖం ద్వారా ఇచ్చే స్వామి తీర్థాన్ని పుచ్చుకునే వారు ఆరోగ్యంగా ఉంటారు చాలామంది పూజలు శంఖాన్ని పెడతారు. పుణ్య దినమున ఇంటిలో పూజ చేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, గురు పుష్యమి, రవి పుష్యమి, విజయదశమి నాడు పెట్టుకుంటే చాలా మంచిది. పుణ్య తిధులు ఉన్న పర్వదినాల్లో తప్పకుండా శంఖానికి పూజ చేయాలి. ఇంట్లో ఒక శంఖాన్ని పెట్టుకోవాలి. రెండు మూడు శంఖాలు పెట్టుకోకూడదని కొందరు అంటూ ఉంటారు. నాలుగు, ఐదు శంఖాలు పెట్టచ్చు. 6, 7, 9 శంఖాలు ఇంట్లో ఉండవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!