రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకోసారి ప్రధాన నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచేశారు మోడీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. నేటి ప్రపంచంలో అంత సులభం కానీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడం ఇండియా కి చెల్లిందని అన్నారు. ఈ విషయాన్ని రష్యా మీడియా నెట్వర్క్ రష్యా టుడే చెప్పింది. గురువారం రష్యన్ స్టూడెంట్ డే సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక అభివృద్ధి వృద్ధిరేటుని కలిగి ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాల వలన ఇది సాధ్యమైంది అని అన్నారు.
Advertisement
Advertisement
నాయకత్వంలో ఇంతటి వేగాన్ని పుంజుకుంది అని విద్యార్థులతో చెప్పారు. రష్యా భారతదేశంపై దాని నాయకత్వం పై ఆధారపడొచ్చు ఎందుకంటే అంతర్జాతీయ వేదికల మీద న్యూఢిల్లీ తమతో గేమ్స్ ఆడదని హామీ ఇవ్వబడింది అన్నారు. ఇండియా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. నేటి ప్రపంచంలో అంత ఈజీ కాదు కానీ 1.5 బిలియన్ల జనాభా ఉన్న ఇండియాకి అలా చేసే హక్కు ఉందని మోడీ నాయకత్వంలో ఆ హక్కు సహకారం అవుతుందని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!