తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలని అమలు చేసిన విషయం మనకి తెలిసింది వీటి మీదే ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే రెండు గ్యారెంటీలని అమలు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మూడవ గ్యారెంటీ ని పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఉచిత విద్యుత్ హామీ అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. వచ్చే నెల నుండి కూడా ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ ని ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి క్లియర్ గా చెప్పేసారు.
Advertisement
Advertisement
ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలని తప్పకుండా అమలు చేస్తామని అన్నారు అయితే ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే అమలు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుల్ల అయిపోయిందని మండిపడ్డారు. అందుకనే హామీల అమలలో జాప్యం నడుస్తోందని కోమటిరెడ్డి అన్నారు. అలానే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కి ఒక సీటు కూడా రాదని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!