Home » ఇన్స్టాగ్రామ్ ద్వారా సితార నెలకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ఇన్స్టాగ్రామ్ ద్వారా సితార నెలకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని తెలియనివారు ఉండరు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, అల్లరి వీడియోలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది సితార. ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సితార నటించలేదు. కానీ లక్షల్లో అభిమానులు ఆమె సొంతం. PMS వారి ఇంటర్నేషనల్ యాడ్ షాట్ తరువాత సితార మరింత పాపులర్ అయ్యారు. చిన్న వయసులోనే అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న సితార సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసారు.

Advertisement

ఈ ఛానెల్ లో తన చిన్నప్పటి విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఆమె అప్పుడప్పుడు సరదాగా చేసే డాన్స్ వీడియోలు కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించకపోయినా.. ఆమె త్వరలోనే సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే సితార పలు సార్లు తనకు సినిమాల పట్ల ఆసక్తి ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. సినిమాల్లో పాటలకు ఆమె వేసిన స్టెప్పులు కూడా అదుర్స్ అనిపిస్తూనే ఉంటాయి.

Advertisement

చిన్న వయసులోనే భారీ స్థాయిలో ఇన్స్టాగ్రామ్ అభిమానులను సొంతం చేసుకున్నారు ఆమె. ఆమెకు ఫాలోయర్స్ కూడా ఎక్కువే ఉండడంతో ఇన్స్టాగ్రామ్ లో ఆమె అనేక ప్రొడక్ట్స్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. వాటిద్వారా ఆమె బాగానే సంపాదిస్తూ ఉంటారు. ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే ఆమె సంపాదన నెలకు ముప్పై లక్షల రూపాయల వరకు ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతోంది. అయితే.. నెలకు ముప్పై లక్షలు సంపాదన అంటే.. టాప్ హీరోలకు కూడా ఇది కొంత కష్టమే. ఈ వార్తా ఇలా వైరల్ అవుతుండడంతో సితార ఇన్స్టాగ్రామ్ తోనే ఇంత సంపాదిస్తుందా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading