అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక వేళ కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిజెపిల మధ్య విమర్శలు వస్తున్న ఈ రామ మందిరం ప్రతిష్ట వేడుక జరుగుతున్న రోజు అనగా జనవరి 22న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. అయితే ఆ రోజు సెలవు ఇచ్చేది లేదని ప్రభుత్వం చెప్పింది ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్ధించారు. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ మేము మా భక్తి మా గౌరవం మతాన్ని ప్రచారం చేయము. ఇలా చేయమని ఎవరు మమ్మల్ని అడగలేదు. కానీ మా మంత్రులు దేవాలయాల్లో పూజలు చేస్తారు మా ప్రార్థనలు ఫలిస్తాయి.
Advertisement
Advertisement
ప్రతి ఒక్కరికి ప్రార్థనలు ఫలిస్తాయని అన్నారు ప్రతి ఒక్కరిని ప్రార్థనలు చేయాలని మేము కోరుతున్నాము అని డీకే శివకుమార్ చెప్పారు. సీఎం సిద్ధరామయ్య పేరు లో రాముడూ నా పేర్లు శివుడు ఉన్నారని ఎవరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదని మమ్మల్ని ఒత్తిడి చేయకూడదు మా డ్యూటీ మేము చేస్తామని బిజెపి డిమాండ్ పై బదులు ఇచ్చారు. రామ మందిర వేడుకలకు సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరు కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!