జనవరి 22న దేశంలో ప్రత్యేకమైన రోజు. ఈ రోజు కోసం అంతా ఎదురు చూస్తున్నారు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రజలు రాముడు విగ్రహ ప్రతిష్టాపన రోజు కోసం ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకుని దేవాలయాలు, రోడ్లు, విమానాశ్రయాలు ఎంతో అందంగా మారుస్తున్నారు. ఈరోజున అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఇక ఆ వివరాలను తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా సెలవుని ప్రకటించారు. జనవరి 22న ఉత్తరప్రదేశ్లో అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు దుకాణాలు మూసి ఉంచాలని చెప్పారు. రాజధాని లక్నో లో జనవరి 22న మాంసం దుకాణాలు మూసివేయాలని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని ఇల్లు గాట్లు దేవాలయాలు దీపాలతో వెలిగించాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గోవాలో కూడా సెలవు దినంగా ప్రకటించారు గోవాలో కూడా అన్ని పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. రాజస్థాన్లోని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా సెలవు ప్రకటించారు ప్రభుత్వం పబ్లిక్ హాలిడే గా ప్రకటించింది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!