Home » 5 గురు హీరోయిన్స్… డైరెక్ట‌ర్ల తో ప్రేమ, పెళ్లి, బ్రేక‌ప్!

5 గురు హీరోయిన్స్… డైరెక్ట‌ర్ల తో ప్రేమ, పెళ్లి, బ్రేక‌ప్!

by Azhar
Ad

సినీ ఇండ‌స్ట్రీలో ప్రేమ‌పెళ్లిల్లు, స‌హజీవ‌నాలు, విడాకులు కామ‌నే! సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఈ 5 గురు హీరోయిన్స్ డైరెక్ట‌ర్స్ ను ఇష్ట‌ప‌డి పెళ్లిచేసుకున్నారు. ఏవేవో మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా వీడిపోయారు. ఆ హీరోయిన్స్ ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!

1) రాధిక :
తెలుగు, త‌మిళ్ సినిమాల్లో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాధిక మొద‌ట తమిళ్ డైరెక్టర్ అయిన ప్రతాప్ పోతేనిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన 3ఏళ్ళ‌కు విడాకులు తీసుకున్నారు. డైవ‌ర్స్ త‌ర్వాత రాధిక లండ‌న్ కు చెందిన రిచ‌ర్డ్ హ‌ర్లీని పెళ్లి చేసుకున్నారు.అత‌నితో కూడా విడాకులు తీసుకున్న రాధిక అటు త‌ర్వాత‌ శ‌ర‌త్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారు

Advertisement

 

2. సోనియా అగర్వాల్:

7G బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు, తమిళ్ భాషల్లో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సోనియా అగర్వాల్ ఆ సినిమా డైరెక్టర్ అయిన‌ సెల్వ రాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ డైవ‌ర్స్ తీసుకున్నారు.

Advertisement

3. అమలాపాల్:
అమలాపాల్ తమిళ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి 2014 లో పెళ్ళి చేసుకుంది. 2017 లో వీరు డైవ‌ర్స్ తీసుకున్నారు.

4. కల్యాణి:

హీరోయిన్ కల్యాణి డైరెక్టర్ సూర్యకిరణ్ ని ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది. భ‌ర్త డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాల్లో కూడా నటించింది. త‌ర్వాత వీరిద్ద‌రూ డైవ‌ర్స్ తీసుకున్నారు.

5.రేవతి

మలయాళం డైరెక్టర్ అయిన సురేష్ మీనన్ ని రేవ‌తి 1986 లో ప్రేమవివాహం చేసుకుంది. 2014 లో వీరు విడిపోయారు.

Visitors Are Also Reading