కొన్ని కారణాల వల్ల హీరోలు మంచి కథలను సినిమాలను మిస్ అవుతారు. ఆ సినిమా మరో హీరో చేయగా సూపర్ హిట్ గా నిలిచి పోతుంది. ప్రతి హీరో కెరీర్లోనూ ఇలాంటి అనుభవాలు ఉంటాయి. కాగా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనూ ఇటువంటి అనుభవాలు ఉన్నాయట. రాజశేఖర్ హీరోగా నటించిన సింహరాశి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు వి. సముద్ర దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో సముద్ర ముందుగా బాలకృష్ణను హీరోగా అనుకున్నారట.
Advertisement
అంతేకాకుండా సినిమా కథతో బాలకృష్ణ దగ్గరికి వెళ్లి ఈ చిత్రం చేయాలని కోరారట. బాలకృష్ణ అప్పటికే సమరసింహా రెడ్డితో సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. దాంతో సింహరాశి లాంటి సినిమా లో ఇప్పుడు నటించడం కరెక్ట్ కాదేమోనని బాలయ్య భావించి తాను చేయనని చెప్పేసారు. అంతేకాకుండా బాలకృష్ణ దర్శకుడు సముద్రను చెన్నకేశవరెడ్డి కథనుజ్ వినాలి అని కోరారట. వివి వినాయక్ స్టోరీ రైటర్ గా చెన్నకేశవరెడ్డి కథను రాశారు.
Advertisement
అయితే మొదట చెన్నకేశవరెడ్డి కథ తనకు అంతగా నచ్చకపోవడంతో బాలకృష్ణ ఒకసారి సముద్రను వినాలని కోరారట. దాంతో ఆయన చెన్నకేశవరెడ్డి స్టోరీ విన్నారు. ఇక కథను విన్న తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాకు సముద్ర దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆయన కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలయ్య సింహరాశి సినిమా పక్కన పెట్టినప్పటికీ చెన్నకేశవరెడ్డి తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.