Home » ఉదయం లేవగానే తలనొప్పి ఉంటోందా..? అయితే ఇలా చేయండి..!

ఉదయం లేవగానే తలనొప్పి ఉంటోందా..? అయితే ఇలా చేయండి..!

by Sravya
Ad

మన ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడం కోసం, జాగ్రత్తలు వహించాలి. ఒక్కొక్కసారి మనం ఉదయాన్నే లేవగానే తలనొప్పిగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది ఉదయం నిద్ర లేవగానే, తలనొప్పితో బాధపడుతూ ఉంటారు నిజానికి మన రోజుని ఎంత ప్రశాంతంగా మొదలు పెడితే అంత ఉత్సాహంగా రోజంతా పని చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఉదయం లేవగానే తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీంతో రోజంతా చికాకుగా ఉంటుంది.

Advertisement

ఏ పని చేయాలని అనిపించదు. అయితే నిద్ర లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది దానికి కారణాలు ఏంటి..? మైగ్రేన్, తలనొప్పి, టెన్షన్ ఇలా చాలా కారణాల వలన తలనొప్పి కలుగుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఒత్తిడి లేదా టెన్షన్ వలన తలనొప్పి రావడం జరుగుతుంది. తలనొప్పి రెండు వైపులా ప్రభావితం చేస్తుంది. కండరాలపై ఒత్తిడి కారణంగా రెండు వైపులా నొప్పి వస్తుంది. ఒత్తిడి భుజం, మెడ, కండరాలు పై ఒత్తిడి చేసి నొప్పిని ఇంకా పెంచుతుంది. అలానే ఆల్కహాల్ ని తీసుకునే వాళ్ళల్లో కూడా తలనొప్పి వస్తుంది. రెడ్ వైన్ తాగిన తర్వాత విపరీతమైన తలనొప్పి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Advertisement

అలానే మైగ్రేన్ సమస్యతో బాధపడే వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తిలో తరచు మార్పులు వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళల్లో నెలసరి సమస్యలు వయసుపై పడడం వలన మనోపాజ్, మైగ్రేన్ తలనొప్పిని ప్రభావితం చేస్తాయి. సరిగ్గా నిద్ర లేకపోతే కూడా ఉదయాన్నే తలనొప్పి వస్తుంది. అలానే సరిపడా నిద్ర లేకపోతే మెదడుకి ఒత్తిడి కలుగుతుంది దీని వలన విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇలా ఉదయం లేవగానే తలనొప్పి రావడానికి కారణాలు ఇవి కాబట్టి పొరపాట్లు జరగకుండా చూసుకుంటే తలనొప్పి సమస్య రాదు. తలనొప్పి తో ఉదయాన్నే బాధపడే వాళ్ళు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించుకోవడం మంచిది.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading