Home » ఈ టీ ని తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గిపోవచ్చు.. పైగా ఈ సమస్యలు కూడా వుండవు..!

ఈ టీ ని తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గిపోవచ్చు.. పైగా ఈ సమస్యలు కూడా వుండవు..!

by Sravya
Ad

చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయడం మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ చిన్న చిట్కాతో ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. అధిక బరువు వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. చాలామంది బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తూ ఉంటారు. సహజ పద్ధతుల ద్వారా మనం బరువు తగ్గొచ్చు. బెల్లం టీ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

పైగా బెల్లం టీ ని తీసుకోవడం వలన అనేక లాభాలు ఉంటాయి బెల్లం టీ ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం పోషకాలు తో నిండి ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి తో పాటు విటమిన్ ఈ, విటమిన్ బి టు కూడా ఉంటాయి. బెల్లం టీ ని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. కొవ్వు కూడా కరిగిపోతుంది.

Advertisement

బెల్లం టీ ని తీసుకుంటే ఐరన్ లోపం సమస్య నుండి కూడా బయటపడొచ్చు. బెల్లం లో పొటాషియం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. స్టవ్ వెలిగించి నీళ్లు పోసుకుని అందులో టీ పొడి వేసుకొని, కొద్దిగా అల్లం అలానే యాలుకలు, దాల్చిన చెక్క వేసి మరిగించాలి తర్వాత మిరియాల పొడి కూడా వేసుకుని బెల్లాన్ని కలుపుకొని బాగా మరిగించి చల్లారిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. రోజుకి రెండుసార్లు మీరు ఈ టీ ని తీసుకోవచ్చు.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading