2023 తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ఖరారు అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు చాలామంది ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. ఈ లవ్ స్టోరీ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
రేవంత్ రెడ్డిది ప్రేమ వివాహం. ఈ వివాహం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. రేవంత్ రెడ్డి భార్య మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు. వీరిద్దరూ చదువుకునే రోజుల్లో గీతారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య మంచి పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో గీతారెడ్డి తండ్రి రేవంత్ తో వివాహం చేయనని ఖరాఖండిగా చెప్పేసాడట.
Advertisement
ఈ వివాహం ఇష్టంలేని గీత రెడ్డి తండ్రి తన కూతురిని ఢిల్లీకి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించాడట. ఇక రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి జైపాల్ రెడ్డితో మాట్లాడాడట. ఇక రేవంత్ లో ఉన్న ధైర్యాన్ని, మాటలను చూసి జైపాల్ రెడ్డి ఒప్పుకొని తన తమ్ముడిని వివాహానికి ఒప్పించారట. ఇక వీరి వివాహాన్ని ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించారు. వివాహా అనంతరం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొని ఎన్నో విజయాలను సాధించారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నాడని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.