Home » ఈ చలికాలంలో ఉసిరికాయ పచ్చడి ఇలా ప్రయత్నించండి.. వేడి అన్నంలోకి మామూలుగా ఉండదు..!

ఈ చలికాలంలో ఉసిరికాయ పచ్చడి ఇలా ప్రయత్నించండి.. వేడి అన్నంలోకి మామూలుగా ఉండదు..!

by Anji
Ad

 చలికాలంలో చలి ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.  ఈ చలికాంలో  ఆహార పదార్థాలను  వేడివేడిగా తీసుకోవడం చాలా ఉత్తమం. చలికి కొన్ని  పదార్థాలు తినలేము కూడా.  చలికి కాస్త కారంగా, పుల్లగా ఉండే వాటిని ఎక్కువగా తినాలనిపిస్తుంది. అందుకే ఎండా కాలంలో పెట్టిన ఆవకాయ పచ్చడిని.. చలికాలంలో ఎక్కువగా తింటారు. అదేవిదంగా ఉసిరికాయల పచ్చడి కూడా పెడుతూ ఉంటారు. ఈ సీజన్ లో ఉసిరికాయలు చాలా విరివిగా లభిస్తుంటాయి.

Advertisement

ఉసిరి కాయతో కూడా చాలా రకాల పచ్చళ్ళను పెడుతూ ఉంటారు. అలాంటి వాటిలో ఉసిరి కాయ తొక్కు పచ్చడి కూడా ఒకటి .  ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే.. ఆహా అనాల్సిందే. దీని గురించి చెబుతుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా.. నిజంగానే అలా ఉంటుంది అండి. ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా.. కాస్త ఇలా వెరైటీగా చేసుకొని తినండి. ఇది చేయడం కూడా  చాలా ఈజీనే. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement


ఉసిరికాయలు, నూనె, ఉప్పు, పసుపు, మెంతులు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మ రసం, ఎండు మిర్చి, కరివేపాకు. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఉసిరి కాయలను లోపల కట్ చేసి గింజలను తీసివేయాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ వేసి వేడి చేయాలి. మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత మరొకటి వేసి దోరగా వేయించాలి. తర్వాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉసిరికాయ ముక్కలు, నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.


ఆ తరువాత చిన్న కడాయి తీసుకోవాలి. తాలింపుకు సరిపడగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక తాలింపు సరకులు వేసి వేయించు కోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి వేడి చేసుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించుకోవచ్చు. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఒకటి రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా మీరు కూడా ట్రై చేయండి.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading