Home » Rami Reddy : విలన్ రామిరెడ్డి ఎలా చనిపోయాడు తెలిస్తే దుఃఖం ఆపుకోలేరు !

Rami Reddy : విలన్ రామిరెడ్డి ఎలా చనిపోయాడు తెలిస్తే దుఃఖం ఆపుకోలేరు !

by Bunty
Ad

ఒకప్పుడు ఇండస్ట్రీలో విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రామిరెడ్డి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన పాత్రకు 100కు 100% న్యాయం చేసే అద్భుతమైన నటుడు. ఇతని విలనిజాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడేటట్టుగా తన నటనతో ఆశ్చర్యపరిచేవాడు. ఇతని అసలు పేరు గంగసాని రామిరెడ్డి. ఇతని స్వస్థలం చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం.

Bollywood Popular Villain Rami Reddy

ఇతనికి చిన్ననాటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇతని మొదటి చిత్రం అంకుశం. ఈ సినిమాలో డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు రామిరెడ్డికి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాతోనే ప్రయాణాన్ని మొదలుపెట్టారు రామిరెడ్డి. ఇక ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం వల్ల వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Advertisement

దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. ఇక ఇతను కొన్ని అనారోగ్య సమస్యల వల్ల మరణించారు. మూత్రపిండాల సమస్యల కారణంగా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ వ్యాధి సోకడం వల్ల ఎంతో బొద్దుగా ఉండే రామిరెడ్డి బక్కగా చిక్కిపోయాడు. ఈ వ్యాధి వల్ల ఎంతో చికిత్స తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. ఎన్నో డబ్బులు ఖర్చుపెట్టారు. చివరికి తీవ్ర అనారోగ్య సమస్యతో 2011 సంవత్సరంలో రామిరెడ్డి కన్నుమూశారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading