నోటి దుర్వాసనతో చాలామంది బాధపడుతూ ఉంటారు. నోటి దుర్వాసన సమస్య నుండి బయట పడాలంటే, ఇలా చేయడం మంచిది. ఇలా చేసినట్లయితే, నోటి దుర్వాసన సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు. నోటి దుర్వాసన నుండి బయట పడాలంటే చూయింగ్ గమ్ ని వాడుతుంటారు. వాటిని రాస్తే దుర్వాసన రాదు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం అతిగా తీసుకుంటే శరీరంలో అమోనియా ఎక్కువ ఉత్పత్తి అయి నోటి దుర్వాసన కి కారణం అవుతుంది.
Advertisement
Advertisement
అలానే చక్కెర తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో దుర్వాసన వస్తుంది. కాఫీ, సిట్రస్ పండ్లు వంటివి తీసుకుంటే కూడా నోటి దుర్వాసన బాగా వస్తుంది. ఆల్కహాల్ వలన నోరు పొడిగా మారిపోయి దుర్వాసన వస్తుంది. వెల్లుల్లి, ఉల్లి తీసుకుంటే కూడా నోటికి నుండి దుర్వాసన వస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోండి. అలానే మౌత్ ఫ్రెషనర్ వంటివి వాడితే నోటి దుర్వాసన తగ్గుతుంది. లేదంటే ఈ ఆహార పదార్థాలు కంట్రోల్ చేసుకుంటే కూడా దుర్వాసన రాదు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!