Home » క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆల్ ఔట్ ఐన నేపాల్..!

క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆల్ ఔట్ ఐన నేపాల్..!

by Azhar
Ad

ప్రపంచ వ్యాప్తంగా రెండో అత్యంత ప్రజాధారణ పొందిన క్రీడాగా క్రికెట్ ఉంది. ఈ లీగ్ లో మొదటి స్థానంలో క్రికెట్ ఉంటుంది. అందుకే క్రికెట్ ను మొదటి స్థానానికి తీసుకురావాలని కంకణం కట్టుతుంది ఐసీసీ. ఈ మధ్య ప్రతి అడుగును ఆ దిశగానే వేస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మొదటిసారిగా U-19 మహిళల ప్రపంచ కప్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ టోర్నీలో చిన్న చిన్న దేశాలకు పాల్గొనే అవకాశాలు ఇవ్వాలని ఐసీసీ అనుకుంది. కానీ ఇప్పుడు అదే క్రికెట్ యూక పరువును తీసేసాల కనిపిస్తుంది.

Advertisement

అయితే ప్రపంచ కప్ కు ముందు ఇందులో పాల్గొనే దేశాలను నిర్ణయించడానికి క్వాలిఫయింగ్ మ్యాచ్ లు నిర్వహిస్తుంది. అందులో భాగంగా నిన్న నేపాల్ – యూఏఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కానీ ఈ మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా నేపాల్ జట్టు కేవలం 8.1 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయిపోయింది. అందువల్ల ఇది క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డుగా నిలిచింది. కనీసం జట్టు మొత్తం కలిసి డబల్ డిజిట్ కూడా చేరలేకపోవడం అనేది చాల దారుణమైన విషయం.

Advertisement

ఇక నేపాల్ జట్టులో 3 పరుగులతో స్నేహ మహారా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలువగా… మొత్తం జట్టులో ఆరుగురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండా డకౌట్ గా పెవిలియన్ చేరుకున్నారు. ఇక యూఏఈ బౌలర్లలో మహికా గౌర్ అనే బౌలర్ 2 పరుగుకు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. అలాగే ఇందుజా నందకుమార్ అనే మరో బౌలర్ 3 వికెట్లు తీసింది. ఇక అనంతరం 9 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన యూఏఈ.. 2.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి :

నా వల్లనే గంగూలీ కెప్టెన్సీ నిలబడింది.. లేకుంటే..?

శ్రీశాంత్ ను కొట్టడం పై స్పందించిన హర్భజన్…!

Visitors Are Also Reading