Home » సూపర్ టైం టేబుల్ ని సెట్ చేసుకున్న ఆరేళ్ల చిన్నవాడు..? చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.

సూపర్ టైం టేబుల్ ని సెట్ చేసుకున్న ఆరేళ్ల చిన్నవాడు..? చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.

by Mounika
Published: Last Updated on
Ad

బాల్యం అనేది మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన దశ. ఎందుకంటే చిన్న వయసులో ఎవరికి కూడా ఎలాంటి చింతలు ఉండవు. చిన్న వయసులో చేసే అల్లర్లు మరియు సాహసాలు ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఆట సమయం కోసం తల్లిదండ్రులను ఒప్పించడం లేదా వారి బొమ్మలతో ఆడుకునేలా స్నేహితులను ఒప్పించడం గురించి అయినా, పిల్లలు ఒప్పందం కుదుర్చుకునే విధానంలో అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చిన్నారికి సంబంధించిన టైం టేబుల్ అందరినీ ఆకట్టుకుంటుంది. లైబా అనే ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా నవ్వులు పుట్టిస్తుంది. ఈ పోస్ట్‌లో, 6 ఏళ్ల బాలుడి దినచర్యను టైమ్‌టేబుల్‌లో చక్కగా ప్లాన్ చేసుకోవడం చూడవచ్చు. ఇందులో మేల్కొనే మరియు అల్పాహారం సమయం మాత్రమే కాకుండా “పోరాట సమయం” కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ బుడ్డోడు చదువుకు సంబంధించిన టైం ని కేటాయించి నెటిజన్లకు బాగా హాస్యాన్ని కలిగిస్తుంది.

Advertisement

ఆడుకోవడానికి, తినడానికి మిగతా కొన్ని పనులకు గంట పైగా సమయాన్ని కేటాయించిన ఈ చిన్నవాడు  కేవలం 15 నిముషాలు చదువుల కోసం కేటాయించాడు. అంతేకాదు తన తాతయ్యలతో మామిడికాయలు తినడానికి కూడా కొంత సమయం కేటాయించుకున్నాడు ఈ చిన్నారి. నా 6 ఏళ్ల బంధువు ఈ టైమ్‌టేబుల్‌ని రూపొందించాడు. బాస్ 15 నిమిషాల కా స్టడీ టైమ్, జింద్గీ తూ మోహిద్ జీ రా హై,” అని లైబా తన 6 ఏళ్ల బంధువు దినచర్య గురించి షేర్ చేసిన పోస్ట్  ఈ టైం టేబుల్ ను చూసి అందరూ కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. లైబా షేర్ చేసిన ఈ పోస్ట్ దాదాపు వన్ మిలియన్ వరకు వీక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా 18 వేలకు పైగా లైసెన్స్ సొంతం చేసుకుంది. నెటిజన్లు సైతం నీ టైం టేబుల్ సూపర్ రా బుడ్డోడా, మీ అమ్మ నిన్ను మంచి క్రమశిక్షణలో పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Visitors Are Also Reading