పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని కొంత మంది చెబుతుంటారు. పెళ్లి గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల శరీరాల్ని కాదు.. మనసులను కూడా కలుపుతుంది. అదేవిధంగా రెండు కుటుంబాలు కూడా దగ్గరవుతాయి. ఇక కూతురైనా, కుమారుడైనా తల్లిదండ్రులకు తమ పిల్లల పెళ్లి జరుగుతుందంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే నూతన దంపతులకు ఒకరిపై ఒకరికి బాధ్యతలు ఏర్పడతాయి. కొత్తగా సంసార జీవితం ప్రారంభమవుతుంది. అయితే అంతా అనుకున్నట్టు జరగదు కదా. కొన్ని జంటలు పలు సమస్యల వల్ల ఎప్పుడు ఇబ్బందులు పడుతుంటాయి. ఎప్పుడు కొందరు దంపతులు గొడవలు పడుతూ ఉంటారు. వారి సంసార జీవితం అంత సజావుగా సాగదు. కానీ కింద తెలిపిన పలు వాస్తు సూచనలు పాటిస్తే దంపతుల మధ్య ఉండే దాంపత్య సమస్యలు పోయి వారి కాపురం హాయిగా సాగుతుంది. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
1. ఆగ్నేయ దిక్కున ఉన్న బెడ్‌రూంలో దంపతులు నిద్రించరాదు. నిద్రిస్తే సమస్యలు వస్తాయి. సమస్యలు పోవాలంటే ఆ దిక్కున ఉన్న బెడ్‌రూంలో నిద్రించరాదు.
2. ఆగ్నేయ దిక్కులాగే ఈశాన్య దిక్కులో ఉన్న బెడ్‌రూంలో కూడా దంపతులు నిద్రించరాదు. సమస్యలు పోవాలంటే ఈ దిక్కున ఉన్న బెడ్‌రూంలో నిద్రించడం మానేయాలి.
Also Read : జీన్స్ ప్యాంట్ వేసుకునే వారు ఈ తప్పు అస్సలు చేయకండి..!
3. ఇంట్లో ఈశాన్య దిశలో కిచెన్ ఉండరాదు. ఆ దిశలో కిచెన్ ఉండకుండా చూసుకుంటే దంపతుల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి.
4. ఇండ్లలో ముళ్లు కలిగిన మొక్కలను మొక్కలను పెంచరాదు. అవి వాస్తు పరంగా దోషాలను కలిగించి దాంపత్య సమస్యలను పెంచుతాయి. ఈ తరహా మొక్కలను ఇండ్లలో పెంచుకోకూడదు.
5. బెడ్‌రూం గోడలకు లైట్ కలర్ పెయింటింగ్ మాత్రమే ఉండాలి. డార్క్ కలర్ పెయింటింగ్ ఉండరాదు. ఈ సూచనలు పాటిస్తే దాంపత్య సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది.
Also Read : ప్రతిరోజు పరిగడుపున జీలకర్ర వాటర్ తాగితే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?