సోషల్ మీడియాలో భీభత్సమైన ఫ్యాన్ బేస్. యూట్యూబ్ లోకి వీడియో వదిలితే లక్షల్లో వ్యూస్. బిగ్ బాస్ సీజన్ 5 లోనే యంగెస్ట్ కంటెస్టెంట్….అన్నీ ఉన్నా షణ్ముక్ జశ్వంత్ రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సింది. దీనికి 5 కారణాలున్నాయి. అవే విన్నర్ కావాల్సిన వాడిని రన్నర్ ను చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
స్టార్టింగ్ ప్రాబ్లమ్ :
Advertisement
మొదటి మూడు వారాలు షన్ను టాస్క్ లను చాలా లైట్ గా తీసుకున్నాడు. నాగార్జున మిరపకాయ్ తినిపించాక టాస్క్ ల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. ఆ మూడు వారాల్లోనే న్యూట్రల్ ఆడియెన్స్ షన్నుకు దూరమయ్యారు.
మోజ్ రూమ్
సిరి, జెస్సీ, షన్ను లు మోజ్ రూమ్ ను తమ పర్మినెంట్ అడ్డాగా మార్చుకున్నారు. దీని కారణంగా వీరు అందరు కంటెస్టెంట్స్ కు దూరంగా ఉండడం వల్ల వీరికి స్క్రీన్ స్పేస్ తగ్గింది. ఏదైనా నెగెటివ్ అయితే తప్ప పాజిటివ్ విషయంలో వీరి మీద కెమెరా అంతగా ఫోకస్ కాలేదు. దీని వల్ల షన్ను బాగా లాస్ అయ్యాడు.
Advertisement
ఓవర్ థింకింగ్ :
5 సీజన్లలో ఎవ్వరూ కూడా షన్ను లాగా ఓవర్ గా ఆలోచించలేదు. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో వెతకడంతో టీనేజ్ అమ్మాయిలు షన్ను కు ఓటేయడానికి ఆలోచించారు. లేడీ ఫ్యాన్ బేస్ ఉన్నవారందరిలో షన్నుకే ఎక్కువ…అది ఇక్కడ మైనస్ అయ్యింది.
కమాండింగ్ :
ప్రతి విషయంలో సిరీనీ, జెస్సీని కంట్రోల్ చేయాలని చూడడం కొన్ని సార్లు మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండడం షన్నుకు పెద్ద మైనస్ అయ్యింది. అరె సిరీ గేమ్ సిరీని ఆడనియ్యర్రా అంటూ చాలా మీమ్స్ వచ్చాయి ఈ విషయంలో…..
ఫ్రెండ్లీ హగ్స్ :
షన్ను ను ఇమేజ్ ను భారీ స్థాయిలో డ్యామేజ్ చేసిన యాస్పెక్ట్ ఇది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ షన్ను కు ఓటేయకుండా చేశాయి ఈ హగ్స్. కేవలం ఫ్రెండ్షిప్ హగ్స్ యే అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ విషయంలో షన్నుకు కనెక్ట్ అవ్వలేకపోయారు. అదే సందర్భంలో అమ్మకోసం కప్ గెలవాలని అనే సన్నీ సెంటిమెంట్ ను గౌరవించి ఓట్లను సన్నీకి వేశారు.