ఐపీఎల్ 2022ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు మొదట మంచి విజయాలు సాధించింది. కానీ దానిని నిలుపుకోలేక పోయింది. ఆయా కూడా అదృష్టం కలిసి వచ్చిన మైనస్ రన్ రేట్ ఉన్న సరే ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ లోకి నాలుగో స్థానంలో వచ్చిన బెంగళూర్ ఎలిమినేటర్ లో విజయం సాధించింది. కానీ క్వాలిఫైర్స్ 2 లో మాత్రం ఓడిపోయింది. అయితే బెంగళూర్ ఈసారి కప్పు కొత్తకపోవడానికి ఈ 5 ఆటగాళ్లే ముఖ్య కారణం. బెంగళూర్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా దారుణంగా ఆడాడు. ఆడిన 16 మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే రాణించగలిగాడు. మిగిలిన 14 మ్యాచ్ లలో విఫలమై బెంగళూర్ జట్టుకు న్యాయం చేయలేదు.
Advertisement
ఈ ఐపీఎల్ లో ఛాలెంజర్స్ జట్టుకెప్టెన్ గా వచ్చిన ఫాప్ డుప్లిసిస్ కూడా అంతగా తన మెరుపులు మెరిపించలేదు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన ఫాప్ డుప్లిసిస్ ఈ ఏడాది తన ప్రభావం చూపలేదు. ఐపీఎల్ 2021 సీజన్ లో బెంగళూర్ జట్టులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఎన్నో మ్యాచ్ లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్కడే గెలిపించాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ మొదట్లో కొన్ని మ్యాచ్ లు మిస్ అయ్యి తర్వాత వచ్చినా.. పెద్దగా రాణించలేదు.
Advertisement
ఈ ఐపీఎల్ మెగావేలానికి రాకుండా రిటైన్ లో భాగంగా 7 కోట్లతో ఆ జట్టుతోనే ఉన్నాడు సిరాజ్. అయితే గత ఐపీఎల్ లో బాగా రాణించి భారత జట్టులోకి వచ్చిన సిరాజ్ ఈ ఐపీఎల్ లో మాత్రం వికెట్లు తీయకపోగా.. బాగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఐపీఎల్ మెగా వేలంలో 10 కోట్లకు పైగా వెచ్చించి వానిందు హసరంగను బెంగళూర్ జట్టు తీసుకుంది. అయితే వికెట్లు తీస్తూ పర్పుల్ క్యాప్ రేస్ లో నిలిచిన వానిందు హసరంగ మాత్రం ఎకానమీ మెంటైన్ చేయలేదు. వికెట్లు తీస్తూ బాగా పరుగులు సమర్పించాడు. అది కీలక సమయాల్లో జట్టును దెబ్బ కొట్టింది.
ఇవి కూడా చదవండి :
విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎందుకు ప్లాప్ అయ్యాడో మీకు…
బట్లర్ కు దాసోహం అన్న రికార్డులు..!