Home » పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే..

పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే..

by Bunty
Ad

చాలామంది సెలబ్రిటీలు… పెళ్లి కాకుండానే తండ్రులు అయిన సంఘటనను మనం చాలా చూశాం. చిత్ర పరిశ్రమ, వ్యాపార రంగం ముఖ్యంగా క్రీడా రంగాల్లో… ఉన్న స్టార్లు పెళ్లి కాకముందే తండ్రులు అయ్యారు. అయితే క్రికెట్ లో పెళ్లి కాకముందే తండ్రి అయిన క్రికెటర్ల గురించి ఇవాళ తెలుసుకుందాం.

Advertisement

వెస్టిండీస్ మాజీ దిగ్గజం సర్ విలియం రిచర్డ్స్ తన కెరీర్ లో బాలీవుడ్ నటి నీనా గుప్త తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కొద్దికాలంపాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేశారు. వారిద్దరూ ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. కానీ నీ వారిద్దరూ పెళ్లి మాత్రం చేసుకోలేదు. వారిద్దరికీ పుట్టిన కూతురికి పెళ్లి జరిగింది. అయినప్పటికీ వారిద్దరూ మాత్రం పెళ్లి చేసుకోలేదు.

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా… గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెర్బియా మోడల్ నటాషా స్టాన్కోవిచ్… తో నిశ్చితార్థం గురించి ఆకస్మికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే వీరిద్దరి పెళ్లి కాకముందే.. నటాషా ప్రెగ్నెంట్ అయింది.

Advertisement

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరియు అతని భార్య కాండిష్ వార్నర్ కూడా ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి ముందు తల్లిదండ్రులు అయ్యారు. 2014లో కండిష్ వార్నర్ మొదటి కుమార్తె ఐ వి కి జన్మనిచ్చింది. క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిన ఒక సంవత్సరం తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్నారు.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రావో కు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన ప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్… 2017 సంవత్సరంలో తొలిసారిగా తండ్రి అయ్యాడు. ఆ సమయంలో రూట్ కు వివాహం కాలేదు. అయితే మార్చి 2016 లో తన స్నేహితురాలితో నిశ్చితార్థం తీసుకున్నాడు రూట్. ఈ నేపథ్యంలోనే పెళ్లి కాకముందే ఓ బిడ్డను కన్నారు.

Visitors Are Also Reading