Home » CM KCR : కర్ణుడి చావుకి…సీఎం కేసీఆర్ ఓటమికి ఈ 5 కారణాలు…?

CM KCR : కర్ణుడి చావుకి…సీఎం కేసీఆర్ ఓటమికి ఈ 5 కారణాలు…?

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరియు రిజల్ట్ కూడా ముగిసిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 40 సీట్లు గెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో అధికారంలోకి వచ్చేసింది. అయితే దాదాపు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన సీఎం కేసీఆర్ చేసిన ఐదు మిస్టేక్స్ కారణంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి పార్టీ ఘోరంగా ఉండడానికి గల ఆ ఐదు మిస్టేక్స్ ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం.

cm kcr

ఇందులో మొట్టమొదటిది కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ పాలన అని తెలంగాణ ప్రజలు భావించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కాలేశ్వరం ప్రాజెక్టు కమీషన్లు, ఆ ప్రాజెక్టు కుంగిపోవడం కూడా ఒక కారణం. ఇక ముఖ్యంగా నిరుద్యోగులు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని భావన నిరుద్యోగులలో స్పష్టంగా కనిపించింది.

Advertisement

cm kcr

cm kcr

అలాగే రైతుబంధు కూడా సీఎం కేసీఆర్ కొంపముంచింది అని చెబుతున్నారు విశ్లేషకులు. ఒక్క ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తే సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యేవాడని… కానీ 100 ఎకరాలు ఉన్న వ్యక్తికి కూడా రైతుబంధు ఇవ్వడం వల్ల… రైతులలో కాస్త అసంతృప్తి రగిలింది. దాంతో గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం విపరీతంగా పెరిగింది. అలాగే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉండడం లేదా ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణమైంది. అసలు తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కలవడమే ముద్ర ఉండటం వల్ల భారత రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోయిందని చెబుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading