టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి కమర్షియల్ హంగులను అద్దిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే రాఘవేంద్ర రావు అందరికీ గుర్తుకొస్తాడు. అడవి రాముడు మూవీ నుంచి కమర్షియల్ చిత్రాలను తీయవచ్చని చాటి చెప్పిన దర్శకుడు. ఆయన సినీ కెరియర్ లో దాదాపు 100కు పైగా చిత్రాలు చేశారు. శ్రీరామదాసు,అన్నమయ్య, నమో వెంకటేశాయ, పాండురంగడు, శిరిడి సాయి, పలు భక్తిరథ చిత్రాలు కూడా అందంగా తెరకెక్కించారు. తన సినిమా కెరియర్ లో దాదాపు అన్ని రకాల చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Advertisement
also read:Breaking : మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి పద్మశ్రీ….!
ఈయన డైరెక్షన్లో చిన్న హీరోల నుంచి మొదలు పెద్ద హీరోల వరకు చేశారు. అలాంటి దిగ్గజ డైరెక్టర్ ఇప్పటివరకు తన సినీ కెరియర్లో ఆ మూడు సినిమాలు తీయలేదని బాధపడుతున్నారట. అవి ఆయన తీరని కోరికలుగా మిగిలాయని అంటున్నారు. అవేంటయ్యా అంటే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గాంధీజీ బయోపిక్. బ్రిటిష్ వారి పాలనపై అహింసా అనే ఆయుధంతో పోరాటం చేసి భారత్ కు స్వాతంత్రం తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ. ఆయన జీవిత కథను తీయలేకపోయారని బాధపడుతున్నారట. అంతేకాకుండా మిల్కా సింగ్ బయోపిక్ గా తెరకెక్కిన బాగ్ మిల్కా బాగ్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి కథను చేయలేకపోయానని బాధపడ్డారట.
Advertisement
ఆ బయోపిక్ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఇంత అందంగా తెరకెక్కించవచ్చని అర్థమైంది. ఇది నేను ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డారట. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాడే గూటి బిళ్ళ ఆటని బ్రిటిష్ వారు కనిపెట్టిన క్రికెట్ ని మనవాళ్లు ఆడి వారిపై ఎలా గెలిచారని చూపించిన లగాన్ మూవీ కూడా ఒక అద్భుతం. ఇలాంటి కథను చూసి నేను ఎందుకు తీయలేకపోయారని ఆయన బాధపడ్డారట. ఈ విధంగా మూడు కోరికలు మిగిలి ఉన్నాయని దర్శకేంద్రుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
also read: