దేశంలోని కార్మిక సంఘాలు రేపు ఎల్లుండి భారత్ బంద్ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మోడీ ప్రభుత్వ విధానాలు రైతులను మరియు కార్మికులను దెబ్బ తీస్తున్నాయని అందుకు నిరసనగా కార్మికసంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.
Advertisement
మార్చి 28, 29 తేదీలలో బంద్ ను ప్రకటిస్తున్నట్టు జాతీయకార్మిక సంఘాట ఐక్యవేదిక స్పష్టం చేసింది. ఈ బంద్ లో రవాణా కార్మికులు మరియు విద్యుత్ కార్మికులు కూడా పాల్గొంటారని ప్రకటించింది. రీసెంట్ గా ఢిల్లీలో వివిధ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు.
Advertisement
ఈ సమావేశంలో కేంద్రం విధానాలు ప్రజలకు కార్మికులకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని అందువల్లే బంద్ కు పిలుపునిస్తున్నట్టు స్పష్టం చేశారు. పెట్రోల్ ధరలు భారీగా పెంచడం….గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకేలా పెంచడం.. వడ్డీ రేట్లు పెంచడం ఇలా అన్ని ధరలు పెంచడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాయి.