భారత్ లో కరోనా పూర్తిగా తగ్గుముకం పట్టింది. గడిచిన 24 గంటల్లో 1259 కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది కరోనాతో మరణించారు.
నేడు, రేపు హన్మకొండలో జాతీయ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఇప్పటికే మహోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.
Advertisement
నేడు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతోంది. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది.
అమరావతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఏపీలోని లేపాక్షి దేవాలయం కు యునెస్కోలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరో ఆరు నెలల్లో యునెస్కో తుదిజాబితా వెలుబడనుంది. లేపాక్షికి యునెస్కోలో చోటు దక్కితే ఏపీ నుండి ఇదే తొలి కట్టడం కానుంది.
Advertisement
నేటి నుండి నాలుగు రోజుల పాటూ సమతామూర్తి విగ్రహ సందర్శనకు సెలవులను ప్రకటించారు. అయితే ఎప్రిల్ 1వరకూ ఎందుకు దర్శనాలను నిలిపివేస్తున్నామన్నది తెలపలేదు.
కేంద్రమంత్రి బీజేపీ నేత నితిన్ గడ్కారీ ముంబైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ కీలక వ్యాక్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షానిది కూడా ముఖ్యపాత్ర ఉంటుందన్నారు. బలహీనపడిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో లోటును భర్తీ చేయడం శుభపరిణామం కాదని వ్యాఖ్యానించారు.
ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్లను ప్రభుత్వం అతిత్వరలో అందుబాటులోకి తీసుకురాబోతుంది. టికెట్ల అమ్మకాల కోసం ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రైవేటు కంటే తక్కువ ధరలకు టికెట్లను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. నేడు లీటర్ పెట్రోల్ పై 90 పైసలు…డీజిల్ పై 76పైసలు పెరిగింది. దాంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.61కి చేరింది. డీజిల్ ధర.99.83 కు చేరుకుంది.