దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో ఆతిధ్య జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. సఫారి గడ్డపై బంగ్లాదేశ్ కు ఇది తొలి విజయం.
భద్రతా మండలిలో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ లో మానవతా సంక్షోభం పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా చేసిన తీర్మానానికి భారత్ తో పాటూ మరో 12 దేశాలు గైహాజరయ్యాయి. ఇదిలా ఉంటే సిరియా,ఉత్తరకొరియా, బెలారస్ లు మాత్రం రష్యా తీర్మానానికి మద్దతు తెలిపాయి.
Advertisement
భారత్ అభివృద్ది చేసిన అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ నిన్న విజయవంతంగా పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతం అయిందని తెలిపింది.
చైనాలో కూలిన బ్లాక్ బాక్స్ విమానం లభ్యమైంది. 132 మందితో ప్రయానిస్తున్న ఈ విమానంలో ఒక్కరి జాడ కూడా తెలియలేదు.
Advertisement
నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్ ఫ్యామిలీ బయల్దేరనుంది.
హైదరాబాద్‌లో నేడు బంగారం వెండి ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ర.51,670 గా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.71,900 గా ఉంది.
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ నేడు నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఢిల్లీలో నేడు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరగనుంది.
ఎన్నికల సంఘం ఆదేశాలను లెక్క చేయకుండా ర్యాలీ నిర్వహించి ప్రసంగాలు చేసినందుకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ నేడు ప్రధాని మోడీతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం తరవాత మొదటిసారి ప్రధానితో భేటీతో అవుతున్నారు.