2022 లో రిలీజ్ అయిన చిత్రాలలో టాప్ వన్ సినిమా అంటే టక్కున చెప్పే జవాబు ఆర్ఆర్ఆర్ అని. పాన్ ఇండియా మూవీ గా వెయ్యి కోట్లకు పైగా భారీ వసూళ్లను ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ టాప్ వన్ ప్లేస్ మాత్రం ఆర్ఆర్ఆర్ కి దక్కలేదని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు.ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని విశ్లేషిస్తున్నారు. సినిమాకి ఖర్చు చేసిన బడ్జెట్ ని,ఆ చిత్రానికి వచ్చిన షేర్ తో సరి పోల్చి లెక్కలు తేల్చారు నిపుణులు. ఆర్ఆర్ఆర్ మూవీ 609 కోట్ల షేర్లను సాధించింది. కే.జి.ఎఫ్-టు 502.65 కోట్ల షేర్ ని పొందింది. భీమ్లా నాయక్ 97.63 కోట్లు షేర్ ని వసూలు చేసింది. సర్కారు వారి పాట 80.62 కోట్ల షేర్ ని సాధించింది. రాధేశ్యాం 83.20 కోట్ల షేర్ ని పొందింది. ఆచార్య 48.36 కోట్ల షేర్ ని దక్కించుకుంది. బంగార్రాజు 39.15 కోట్ల షేర్ ని వసూలు చేసింది.డీజే టిల్లు 17 కోట్ల షేర్ ని సాధించింది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం 350 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన ఆర్.ఆర్. ఆర్ కి 609 కోట్ల షేర్ దక్కింది. కేవలం 8 కోట్ల పెట్టుబడి పెట్టిన డీజే టీల్లు 30 కోట్ల గ్రాస్ ని, 17 కోట్ల షేర్ ని సాధించింది. అంటే పెట్టుబడికి రెండు రెట్లకు పైగా లాభాన్ని ఆర్జించింది. అందువల్ల 2022 సంవత్సరంలో నెంబర్ వన్ సినిమాగా డీజే టిల్లు సినిమాను పేర్కొంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Advertisement
Advertisement
ALSO READ;
యమలీల సినిమా నుండి తప్పుకునేలా సౌందర్యను భయపెట్టింది ఎవరో తెలుసా..?
తన పేరునే సీనియర్ ఎన్టీఆర్ మనవడికి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా…?