Telugu News » య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకునేలా సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టింది ఎవ‌రో తెలుసా..?

య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకునేలా సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టింది ఎవ‌రో తెలుసా..?

by AJAY MADDIBOINA

Actress Soundarya Yamaleela movie: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హాన‌టి సావిత్రి త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి అందం అభిన‌యంతో అల‌రించిన హీరోయిన్ సౌంద‌ర్య‌. రొమాంటిక్ సీన్ల‌కు గ్లామ‌ర్ షోకు పూర్తి దూరంగా ఉన్న సౌంద‌ర్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలా చీర క‌ట్టుతోనే ఎన్నో సినిమాల్లో క‌నిపించింది. దాదాపు తెలుగులోని అంద‌రు స్టార్ హీరోల‌తోనూ సినిమాలు చేసింది. సినిమాల్లో రానించిన త‌ర‌వాత ప్ర‌జాసేవ చేసేందుకు రాజ‌కీయాల్లోకి కూడా సౌంద‌ర్య ప్ర‌వేశించింది.

Ads

 

బీజేపీలో చేరి ఎన్నిక‌ల ప్రచారంలో బిజీ అయింది. ఈ క్రమంలోనే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారానికి హెలికాప్ట‌ర్ లో బ‌య‌లుదేర‌గా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో సౌంద‌ర్య మ‌ర‌ణించింది. ఆమె మ‌ర‌ణాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక సౌంద‌ర్య స్టార్ హీరోల ప‌క్క‌నే కాకుండా క‌మెడియ‌న్ అలీతోనూ సినిమాలు చేసింది. అంతే కాకుండా ముందుగా సూప‌ర్ హిట్ సినిమాలో య‌మ‌లీల‌లో సౌంద‌ర్య‌నే హీరోయిన్ గా అనుకున్నారు.

ali yamaleela

ali yamaleela

ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా క‌మెడియ‌న్ అలీ హీరోగా న‌టించాడు. అయితే ఈ సినిమాలో ఎస్వీ కృష్ణారెడ్డి ముందుగా సౌంద‌ర్య‌నే హీరోయిన్ గా తీసుకోవాల‌ని అనుకున్నారు. సౌంద‌ర్య‌కు క‌థ చెప్ప‌డంతో ఆమె కూడా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ali yamaleela

కానీ ఆ త‌ర‌వాత అప్ప‌టికే సౌంద‌ర్య ఒప్పందం చేసుకున్న కొన్ని సినిమాల నిర్మాత‌లు వ‌చ్చి య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకోవాల‌ని కండిష‌న్ పెట్టారు. క‌మెడియ‌న్ ప‌క్క‌న హీరోయిన్ గా న‌టిస్తే క్రేజ్ త‌గ్గిపోతుంద‌ని ఆ త‌ర‌వాత వ‌చ్చే సినిమాల‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని సౌంద‌ర్య తండ్రి స‌త్య‌నారాయ‌ణ ఎస్వీ కృష్ణారెడ్డికి వివ‌రించారు. ఆ త‌ర‌వాత య‌మ‌లీల సినిమాలో హీరోయిన్ గా ఇంద్ర‌జ‌ను ఎంపిక చేశారు.

ALSO READ :

త‌న పేరునే సీనియ‌ర్ ఎన్టీఆర్ మ‌న‌వ‌డికి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా…?


You may also like