Home » త‌న పేరునే సీనియ‌ర్ ఎన్టీఆర్ మ‌న‌వ‌డికి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా…?

త‌న పేరునే సీనియ‌ర్ ఎన్టీఆర్ మ‌న‌వ‌డికి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు చిత్ర‌సీమ‌లో నంద‌మూరి తార‌కరామారావు చెర‌గని ముద్ర వేసుకున్నారు. పౌరాణిక‌,సాంఘీక‌, జాన‌ప‌ద చిత్రాల‌లో న‌టించి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. విల‌క్ష‌ణమైన త‌న న‌ట‌న‌తో ఎన్టీరామారావు న‌ట విశ్వ‌రూప‌రాన్ని ప్ర‌ద‌ర్శించారు.

 

దాంతో తెలుగు హీరో అయిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లోనే దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నారు. సినిమాల్లో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న త‌ర‌వాత ఎన్టీరామారావు రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. రాజ‌కీయాల్లో సైతం ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ప్రాంతీయ పార్టీ స్థాపించి జాతీయ‌నాయ‌కులకు వ‌ణుకు పుట్టించారు.

Advertisement

Sr.Ntr and Jr.Ntr

Sr.Ntr and Jr.Ntr

పార్టీ స్థాపించిన అతిత‌క్కువ కాలంలోనే సీఎం కుర్చీపై కూర్చుకున్నారు. సీఎంగా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రారంభించి తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేశారు. ఇక నంద‌మూరి ఫ్యామిలీలో ఎన్టీరామారావు త‌ర‌వాత ఆయ‌న న‌ట ప్ర‌స్థానాన్ని బాల‌కృష్ణ కొన‌సాగించారు. బాల‌య్య త‌న జ‌న‌రేష‌న్ లో స్టార్ హీరోగా రానించారు…రానిస్తున్నారు. ఇక బాల‌య్య త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి క్రేజ్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కు వ‌చ్చింది. ఎన్టీఆర్ పోలిక‌లు తాత‌లా ఉండ‌టం…న‌ట‌న‌లోనూ తాత‌క త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవ‌డంతో బాల‌య్య కంటే ఎన్టీఆర్ కు ఎక్కువే క్రేజ్ ఉంది.

Advertisement

ntr

ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి టీడీపీ పార్టీని ఆదీనంలోకి తీసుకోవాల‌ని కూడా కొంత‌మంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి ఎదుగుతార‌ని ఎన్టీరామారావు ముందే ఊహించారు. అంతే కాకుండా త‌న పేరునే ఎన్టీఆర్ కు పెట్టారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా బాల‌రామాయ‌ణం తో పాటూ మరికొన్ని సినిమాల్లో నటించారు.

కాగా ఎన్టీఆర్ కు 11 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు అబిడ్స్ లో ఉంటున్న ఎన్టీరామారావు వ‌ద్ద‌కు హ‌రికృష్ణ తీసుకువెళ్లాడు. అప్ప‌డు ఎన్టీరామారావు ద‌గ్గ‌ర‌కు తీసుకుని నీ పేరేంటి అని అడ‌గ్గా తార‌క్ రామ్ అని చెప్పాడు. దాంతో హరికృష్ణ‌ను పేరు తార‌క్ రామ్ అని ఎందుకు పెట్టావ్ అని అడ‌గ్గా అమ్మ పేరు రాముడి పేరు క‌లుస్తుంద‌ని అలా పెట్టాన‌ని చెప్పాడు. దాంతో ఎన్టీరామారావు నా మ‌న‌వ‌డు నా పోలిక‌ల‌తో ఉన్నాడు. అతడిని నా అంశ జీవితంలో గొప్ప‌వాడు అవుతాడు అని చెప్పి నంద‌మూరి తార‌క‌రామారావు గా పేరు మార్చేశారు. ఇక ఎన్టీరామారావు ఊహించిన‌ట్టుగానే ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.

ALSO READ  :

య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకునేలా సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టింది ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading