మేడారం సమ్మక్క సారక్కలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై నేడు దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో గవర్నర్ మేడారంకు చేరుకుంటారు. 12 గంటల సమయంలో గవర్నర్ వన దేవతలకు తన ఎత్తు బంగారం ఇవ్వనున్నారు.
Advertisement
నేడు డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహించనున్నారు.
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ లో ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. మజ్జిగ తాగే విషయంలో విద్యార్థులు గొడవపడ్డారు. దాంతో యూనివర్సిటీ ప్రిన్సిపల్ ముగ్గురిని సస్పెండ్ చేశారు.
డీజీగా బదిలీ అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Advertisement
ఎన్నికల తరవాత బుల్డోజర్లు పనిమొదలు పెడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాక్యలు చేశారు. మార్చి 10 తరవాత బుల్డోజర్లు నేరగాళ్ల పనిపడతాయని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి మెదక్ నుండి గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. నేడు రాజీనామా పై జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాయనున్నారు.
హైదరబాద్ లోని హైదర్షాకోట్ లోని కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఆశ్రమం నుండి 18 మంది యువతులు తప్పించుకున్నారు. నగరంలో పలు నేరాలకు పాల్పడిన యువతులను పోలీసులు ఈ ఆశ్రమంలో బంధించగా వారు బాత్రూం కిటికీ ఊచలు విరగొట్టి పారిపోయారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు దాడికి సిద్దంగా ఉన్నాయి. ఏక్షణమైనా విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఉక్రెయిన్ పై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
త్వరలో తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. టీఎస్ఎస్పీడీఎస్ పరిధిలో ఇప్పటికే 22 వేల ప్రీపెయిడ్ మీటర్లు ఉన్నట్టు సమాచారం. వినయోగదారులు ఆసక్తి చూపకపోవడంతో రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని డిస్కంలు నిర్ణయించాయి.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నిర్ణయంతో మమతాబెనర్జీ పార్టీ తదుపరి వారసుడిపై సంకేతం ఇచ్చిందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.