Home » Hyderabad : మహిళ కిడ్నీలో 156 స్టోన్స్…డాక్టర్లు ఎలా తీసారంటే..?

Hyderabad : మహిళ కిడ్నీలో 156 స్టోన్స్…డాక్టర్లు ఎలా తీసారంటే..?

by AJAY
Ad

సాధారణంగా ఒక కిడ్నీ స్టోన్ వస్తేనే a నొప్పిని భరించడం చాలా కష్టం కానీ తాజాగా హైదరాబాద్ లో ఓ మహిళ కిడ్నీ లో 156 స్టోన్ లు బయటపడ్డాయి. హుబ్లీ కి చెందిన ఓ స్కూల్ టీచర్ కు సడన్ గా రెండు రోజుల క్రితం కడుపునొప్పి వచ్చింది. ఆ నొప్పిని బరించలేక హాస్పిటల్ కు వెళ్ళగా అక్కడ డాక్టర్ నిర్ధారణ కోసం స్కానింగ్ టెస్ట్ రాశాడు. ఇక ఆ టెస్ట్ చేసిన వైద్యులు రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. ఆ మహిళ కిడ్నీ లో ఒకటి రెండు కాకుండా ఏకంగా 156 రాళ్ళు ఉన్నట్టు గుర్తించారు.

Advertisement

Advertisement

దాంతో ఆ మహిళ హైదరబాద్ లోని ప్రీతి యురాలజి అండ్ కిడ్నీ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చింది. దాంతో ఆ యాభై ఏళ్ల మహిళకు మేజర్ ఆపరేషన్ చేయకుండా లాప్రోస్కోపి మరియు ఎండో స్కోపి విధానం ద్వారా వైద్యులు ఆపరేషన్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి వైద్యులు ఆమె కిడ్నీ లో ఉన్న 156 రాళ్ళను బయటకు తీశారు. మన దేశంలోనే కిడ్నీ లో ఇన్ని రాళ్ళు గుర్తించి ఆపరేషన్ చేయడం ఇదే మొదటి సారి అని వైద్యులు చెబుతున్నారు.

 

అంతే కాకుండా మహిళ కిడ్నీలో గత రెండేళ్లుగా రాళ్ళు మొదలయ్యాయి అని చెప్పారు. కానీ నొప్పి రావడానికి రెండేళ్లు పట్టినట్టు తెలిపారు. కీ హోల్ ఆపరేషన్ ద్వారా మహిళకు ఆపరేషన్ చేసినట్టు వివరించారు. అంతే కాకుండా ప్రస్తుతం మహిళ పూర్తి ఆరోగ్యంగా ఉందని..తన పనులు తాను చేసుకోగలరు అని తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. దాంతో డాక్టర్ల పై నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.

Visitors Are Also Reading