క్రికెట్ అంటే వన్డే, టెస్ట్ మ్యాచ్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా చూడడానికి అంతా ఆసక్తి కనబరుచరు. కానీ టీ-20 మ్యాచ్ మజానే వేరు. బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలు, సిక్సుల వర్షం కురిపిస్తుంటే.. బౌలర్లు ప్రేక్షక పాత్ర వహిస్తుంటారు. అప్పుడప్పుడూ మాత్రమే బౌలర్లు రాణిస్తుంటారు. ప్రతీ టీ-20 మ్యాచ్‌లో ఇదే తంతు ఎక్కువగా కొనసాగుతుంటుంది. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ పెషావర్ జల్మి, ఇస్లామాబాద్ యునైటేడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లు పెను విధ్వంసమే సృష్టించారని చెప్పాలి. ఇరువురు సూపర్ ఫాస్ట్ అర్థ సెంచరీలతో దూసుకెళ్లారు.
Also Read : విరాట్ కోహ్లీ ఆట తీరుపై ఆ మాజీ ఓపెనర్ ఏమన్నారో తెలుసా..?
Advertisement
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోని 24వ మ్యాచ్‌లో పెషావర్, ఇస్లామాబాద్ జట్లు తలబడ్డాయి. అయితే టాస్ గెలిచిన పెషావర్ జల్మీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 20 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ హారిస్ ఓపెనర్‌గా బరిలోకి దిగి అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 218 స్ట్రైక్ రేట్‌తో 32 బంతుల్లో 7 పోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఆ జట్టులో అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. యాసిర్ ఖాన్ (35), షోయబ్ మాలిక్ (38) కూడా రాణించడంతో పెషావర్ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. ఇస్లామాబాద్ యునైటేడ్ బౌలర్లలో అష్రప్ 3 వికెట్లు, మక్సూద్ 2 వికెట్లు, డిలాంగ్, డాసన్, జాహిర్‌ఖాన్ చెరొక వికెట్ తీశారు.
Advertisement
ప్రత్యర్థి టీమ్ 207 లక్ష్యంతో చేదించేందుకు బరిలోకి దిగింది ఇస్లామాబాద్ యునైటేడ్. ఇందులో ఓపెనర్లు ఇద్దరూ అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఆజామ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాడు. 45 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 పోర్లు, 7 సిక్సర్లుండటం విశేషం. దాదాపు జట్టును గెలుపు తీరాలకు చేర్చే ప్రయత్నం చేసిన ఆజామ్ ఖాన్.. రియాజ్ బౌలింగ్‌లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో పెషావర్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నది. మహమ్మద్ హారిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read : శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడానికి కారణం ఏమిటో చెప్పిన రోహిత్