Home » 14th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

14th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసులు భారీగా తగ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో 34,113 కొత్త కరోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా వ‌ల్ల నిన్న 349 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

శ్రీహరికోటలో PSLV C 52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. దాంతో శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు జరుపుకుంటున్నారు. కక్ష్యలోకి రి శాట్ తో పాటు ఇన్ స్పైర్, INS 2D ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. ప్రయోగతీరుపై ఇస్తో చైర్మన్ సోమ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే PSLV C 53 రాకెట్ ప్రయోగం జరుపుతామని ప్రకటించారు.

Advertisement

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని స్క్రాప్ యార్డ్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ డ్రమ్ముల్లో మిగిలిపోయిన కెమికల్స్ మంటలతో పేలుడు సంభవించింది. సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పొలాల మధ్యలో ఖాళీ డ్రమ్ములు, ప్లాస్టిక్ వ్యర్ధాలు కోసం గాయత్రి ఏజెన్సీ యార్డ్ నిర్వహిస్తోంది.

రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని టిటిడి ప్రారంభించనుంది. రోజుకి 15వేల టోకెన్లు జారీ చేయనుంది. అలిపిరి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్నారు.

Advertisement

హైకోర్టులో ఉదయం 10‌‌:30 గం.లకు 7గురు జడ్జిల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ,తర్లడ రాజశేఖర్ రావు,సత్తి సుబ్బారెడ్డి,రవి చీమలపాటి, వడ్డిబోయిన సుజాతల చేత సీజే జస్టిస్ పీకే మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఆదిలాబాద్ లో చలి వణికిస్తోంది. ఓ వైపు మధ్యానం ఎండలు కొడుతుండగా రాత్రుళ్లు చలి వణికిస్తోంది. దాంతో భారీగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 8.8 డిగ్రీలు, వాంకిడి లో 9.3 డిగ్రీలు, సోనాలలో 9.5 డిగ్రీలు. బజార్ హత్నూర్ లో 9.9 డిగ్రీలు, ర్యాలీలో 10.2, పెంబిలో 10.4 డిగ్రీలు నమోదయ్యాయి.

ముచ్చింతల్ లో నేటితో సహరాభివృద్ది వేడుకలు ముగియనున్నాయి. కాగా ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

chiranjeevi

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి దంపతులు కేర‌ళ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ప‌ర్య‌ట‌న‌లో శ‌బ‌రిమ‌ల‌, గువాయూర్ ఆల‌యాల‌ను సంద‌ర్శించారు.

రాజ్యాంగం ప్రకార‌మే వ్య‌వ‌స్థ నడుస్తుంద‌ని ష‌రియ‌త్ ప్ర‌కారం కాద‌ని యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు. క‌ర్నాట‌క‌లో హిజాబ్ ర‌గ‌డ నేపథ్యంలో యోగి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Visitors Are Also Reading