Home » 13th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

13th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

దేశంలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. సీడబ్ల్యుసీ ఈరోజు సాయంత్రం 4గంటలకు ఢిల్లీ లోని పార్టీ కార్యాలయం లో భేటీ కానుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది.

Advertisement

సౌదీ అరేబియాలో ఓకే రోజు ఏకంగా 81 మందికి మరణశిక్షను అమలు చేశారు. హత్యలతో పాటు ఇతర నేరాలకు పాల్పడిన 81 మందికి ఈ శిక్ష విధించారు.

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చార్మినార్ పై ప్లెక్సీ ఏర్పాటు చేశారు. కాగా ఈ విషయం వివాదాస్పదమైంది. చారిత్రక కట్టడాల పై ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం అని చార్మినార్ కంజర్వేటివ్ రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాంగో లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పట్టాలు తప్పడం తోనే రైలు ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

ఏపీలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా మే 2 నుండి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వీటిని 9వ తేదీకి మార్చనున్నారు.

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ ల బంగారం ధర రూ. 48,400 గా ఉండగా….24 క్యారెట్ ల బంగారం ధర రూ. 52,800 కు చేరుకుంది.

యుపిలోఎమ్మెల్యేలు గా గెలిచిన అఖిలేష్‌ యాదవ్‌, ఆజామ్‌ ఖాన్ లు ఆ పదవులను వదులుకోనున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎంపీలుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎస్పీ అధికారంలోకి రాకపోవడంతో ఎంపీలుగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు.

తిరుమలలో నేటి నుంచి ఐదు రోజులు పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ శ్రీరాముని అవతారంలో మూడు ప్రదక్షిణములుగా తెప్పలపై స్వామివారు విహరించనున్నారు.

తెలంగాణలో మార్చి 16వ తేదీ నుండి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. మే 20న చివరి పనిదినం కాగా మే 21 నుండి విద్యార్థులకు సెలవులు ఇవ్వనున్నారు.

Visitors Are Also Reading