హైదరాబాద్ లోని టోలిచౌకిలో రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌పై దాడి చేసి ప్రైవేట్ ఆస్పత్రిలో దాక్కున్నాడు. పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా పేషెంట్ మెడపై కత్తి పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న జనగామలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి ఈటల వెళ్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
నేడు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 4 గం.లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. బీడీఎల్ పై రక్షణ మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అంతే కాకుండా 5 గంటలకు చిన జీయర్ స్వామి ఆశ్రమంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు.
ఉత్తరప్రదేశ్ లో తొలివిడత ఎన్నికల పోలింగ్ మొదలయ్యింది. మొత్తం 11 జిల్లాలు 58 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.
గడిచిన 24గంటల్లో దేశంలో 67.084 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా కొత్తగా దేశంలో 1241 మంది కరోనాతో మృతి చెందారు.
Advertisement
జగిత్యాలలో ఓ యువతి ప్రేమ మత్తులో ఇంట్లో నుండి ఆరు లక్షల రూపాయలు తీసుకుని యువకుడితో ఉడాయించింది. తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండే యువకుడితో యువతి ఉడాయించగా పోలీసులు యువతి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రేమికులను అదుపులోకి తీసుకున్నారు.
భారతదేశ జీడీపీ ప్రస్తుతం 7.8గా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికంట దాస్ వెల్లడించారు.
సీఎం జగన్ నిన్న విశాఖపట్నంలో శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ సంధర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అయితే దీనిపై సీఎం సీరియస్ అయ్యారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని డీజీపీకి తెలిపారు.
శ్రీలంక చెరలో ఉన్న జాలర్లను విడుదల చేపించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. శ్రీలంక జవాన్లు మొత్తం 29మంది భారత జాలర్లను పట్టుకున్నారు.
హైదరాబాద్ లోని మియాపూర్ లో న్యూకాలనీలో ఓ ఇంట్లో షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే కుటుంబం అప్రమత్తం అవడంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.