సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు అనే చెప్పారు. ఏ దర్శకుడు అయినా తన కెరీర్‌లో ఒక్కటి లేదు రెండు ప్రయోగాత్మక సినిమాల ప్రయత్నం చేశాడు. కమర్షియల్ మాస్ సినిమాలతో పాటు ఇలాంటివి కూడా చేయగలమని ప్రతి దర్శకుడు ఒక్కసారైనా ట్రై చేసి ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఈయన ఎంటండీ బాబూ.. సినిమా తీస్తే ప్రయోగమే. ఒక్క మాటలో ఆయనను ప్రయోగాల నిధి అని చెప్పొచ్చు. అవి ప్రయోగాత్మక సినిమాలు అయినా కలెక్షన్ల వారీగా సక్సెస్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కొట్టారు. ఇలాంటివి మరొకరు చేయలేరు. ఇలా సినిమాలు ఎవరు తీయలేరనేలా చేసి చూపించారు. ఆయన ఎవరో కాదు.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.
Advertisement
ప్రయోగాత్మక సినిమాలు తీయడం అంటే అంత సులభం కాదు. ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని కొత్త కాన్సెప్ట్ ని అలవాటు చేయాలి, అది వాళ్ళు చూసి హిట్ చేసేంత పొటెన్షియల్ ఆ కంటెంట్ కి ఉండాలి. అలా మన సింగీతం విషయంలో అనుకుంటే ఆయన ప్రయత్నం చేసినవి దాదాపు అన్నీ ఇలాంటివే. ఏ సినిమా చూసుకున్నా మరో దానికి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ జోనర్. కాబట్టి, ప్రతి సినిమా ఓ పెద్ద టాస్క్ లాంటిది. చరిత్రలో అలా ప్రతి సినిమాని ప్రయోగాత్మకంగా మనకు అందించిన దర్శకుడు ఒక్క సింగీతం అని చెప్పాలి. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఎపిక్ ‘మాయాబజార్’ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేసిన ఆయన కెరీర్ లో ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మయూరి
గ్రేట్ క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ గారి బయోపిక్ ఇది. యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్న సుధా చందన్ తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ ని వదలుకోలేక జైపూర్ ఫుట్ పెట్టించుకుని మరీ తానా డ్యాన్స్ ని కంటిన్యూ చేసారు. ఎన్నో సర్లు స్టేజీలు పై ఆ టెంపరరీ లెగ్ తో నే ఆమే పెర్ఫార్మ్ కూడా చేసారు. ఇదే కాన్సెప్ట్ తో సింగీతం తీసిన సినిమా ‘మయూరి’. పైగా థానా బయోపిక్ లో తానే నటించి హిస్టరీ క్రియేట్ చేసారు సుధా చంద్రన్ గారు. నిజానికి అప్పటికి మనకు అసలు బయోపిక్స్ అనే కాన్సెప్ట్ పెద్దగా తెలియదు. ఓ స్ట్రాంగ్ అండ్ టాలెంటెడ్ లేడీ రియల్ లైఫ్ స్టోరీని సినిమా తీసి ప్రయోగం చేశారు సింగీతం.
పుష్పకవిమానం
సినిమా నీ ఇలా కూడా తీస్తారా..? అసలు తీయొచ్చా..? తీసినా ప్రేక్షకులు చూస్తారా..? అని ఈ సినిమాతో మొత్తం ఇండస్ట్రీ చూపు నిథాన వైపు తిప్పుకునేలా చేసారు సింగీతం. అదే ‘పుష్పక విమానం’ సినిమా. అసలు ఒక్క డైలౌగే కూడా లేకుండా సినిమా నా.. అసలు సాధ్యమా? సినిమాలో ఎవరితో ఎవరు మాట్లాడుకోరు, అయినా కథ రన్ అవుతుంది.. చూసే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. పైగా థ్రిల్లింగ్ ఉండి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఒక కొత్త ప్రయోగం చేసి దిమ్మ తిరిగే స్క్రీన్ ప్లే తో హిట్ కొట్టచ్చు అని ప్రూవ్ చేశారు.
ఆదిత్య 369
కాలం తో ప్రయాణం చేయడం.. ఇది ఎప్పటికీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ‘ఆదిత్య 369’ వచ్చిన టైమ్ లో అయితే మరీ అడ్వాన్స్ డ్ కాన్సెప్ట్. అసలు ఆ టైమ్‌లో ఇలాంటి కథతో సినిమా చేద్దాం అనే ఆలోచన రావడమే గొప్ప అని చెప్పాలి. ఓక రెగ్యులర్ ఫార్ములా కి అలవాటు పడిన ఇండస్ట్రీ ఇలాంటి కంటెంట్ ని యాక్సెప్ట్ చేస్తుందా? తీస్తే ప్రేక్షకులు చూస్తారా? అయినా ధైర్యం చేసి సాధారణ వ్యక్తులకు కూడా ఈజీగా అర్థం అయ్యేలా ఇలాంటి కాన్సెప్ట్ ని పిక్చరైజ్ చేయడం సూపర్బ్ కదా.. ఎప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ గొప్పగా చెప్పుకునే సినిమా అని.. తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే ప్రయోగం ‘ఆదిత్య 369’.
విచిత్ర సోదరులు
వెండితెర మీద ఒక కమల హాసన్ ని చూడటానికే మనకు కళ్ళు సరిపోవు. అలాంటిది ఈ సినిమాలో ముగ్గురు కమల్ హాసన్ లు. అందులో ఒకరు మరుగుజ్జు(మరగుజ్జు)పైగా. ఇక చూడండీ..ఇచ్చిన రోల్ ని సొంతం చేసుకొని ప్రాణం పెట్టి జీవించే కమల్ కి ఇలాంటి టిపికల్ అండ్ పెర్ఫార్మెన్స్ రోల్స్ ఇస్తే విశ్వరూపం చూపించి వదిలేశాడు. కమల్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ ఇది. ఇలాంటి ప్రయోగాన్ని కమల్ తో చేయాలంటే సింగీతం గారే మరి. ఇందులో కమల్ మరుగుజ్జు క్యారెక్టర్ ని స్క్రీన్ పై ఎలా ప్రెజెంట్ చేశారో ఇప్పటికి ఒక మిస్టరీ.
Advertisement
మేడమ్
సినిమా లో హీరో అయినా అందులో కూడా థానా కామిక్ టచ్ ని వదలరు మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మాములుగా కామెడీ చేస్తేనే పడి పడి నవ్వుతాం..ఇక లేడీ గెటప్ వేస్తే..? అలా వచ్చిందే సింగీతం గారి డైరెక్షన్ లో ‘మేడమ్’ సినిమా. ఈ సినిమాతో అప్పటి వరకు మనకు తెలిసిన రాజేంద్ర ప్రసాద్ గారిని మరింత కొత్త గా పరిచయం చేశారు. సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని అలా సినిమా మొత్తం లేడీ గెటప్ లో చూపించి ఆడియన్స్ ని సంతృప్తి పరచడం కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఏమంటారు..? ఎన్ని సార్లు సినిమా చూసినా బోర్ కొట్టదు.
భైరవద్వీపం
చిన్నప్పుడు మనం ఎన్నో చందమామ కథలు పుస్తకంలో చదువు. అలాంటి ఒక చందమామ కథ ని మాత్రమే మనకు తెర పైకి తెచ్చింది సింగీతం గారే. అదే ‘భైరవ ద్వీపం’ సినిమా. బాలయ్య బాబులో నీ ఒక మంచి నటుడు నీ మనకు మొదట పరిచయం చేసింది కూడా ఈ సినిమా అని చెప్పాలి. రాజ్యాలు, అంతఃపురాలు, రాజులు, ఎగిరే మంచం, మాట్లాడే గుర్రం, మంత్రికుడి మాయలు, భయపెట్టే రాక్షసులు, మనుషులు, దేవకన్యలు.. అబ్బో చెప్పాలంటే ఎన్నో మరెన్నో. ఒక్క సినిమాతో అద్భుతం చేశారు సింగీతం.
Also Read : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూత
శ్రీకృష్ణార్జున విజయం
ఇన్ని డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేసి సక్సెస్ అయిన సింగీతం గారు ఇది మాత్రం ఎలా వదిలేస్తారు. పౌరాణిక సినిమా నీ కూడా డైరెక్ట్ చేసాడు.. అదే ‘శ్రీ కృష్ణార్జున విజయం’. హిందూ పురాణాలలో చాలా ముఖ్యమైనది అయిన మహాబర్తంలో శ్రీకృష్ణుడు, పాండవుల కథని సినిమాగా తీసి తానేంటో మళ్లీ నిరూపించుకున్నారు. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవచ్చు.. కానీ ఇలాంటి కథను కూడా హ్యాండిల్ చేసి ఆల్ రౌండర్ డైరెక్టర్ అనిపించుకున్నారు సింగీతం గారు.
వెల్‌కమ్ ఒబామ
చెప్పుకోవడానికీ ఎప్పుడు వచ్చినా పాత కాలం డైరెక్టర్ అనుకుంటాం సింగీతం గారిని.. కానీ ఇప్పటి జనరేషన్ లో ఉన్న కంటెంట్ ని కూడా వదిలిపెట్టారు. ఇప్పటి డైరెక్టర్స్ స్టైల్ లో కూడా ఆయన మనసు ఆలోచించగలడు. అలా వచ్చిన సినిమా నేను ‘వెల్‌కమ్ ఒబామా’. బేసిక్ గా ఈ సినిమా సరోగసీ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ విధానంతో ఎంతో మంది పిల్లలని కంటున్న విషయం మనకు తెలిసిందే. కృష్ణుడు ఒక తల్లికి పుట్టి ఇంకో తల్లి దగ్గర పెరిగినట్లు.. ఇందులో కూడా అలాంటి ఇద్దరు తల్లులు – ఒక బాబు మధ్య కథను నిర్వచించి ఒక ప్రయోగం చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా మన సింగీతం గారే.
అల్లాదీన్ కుమారుడు
మనకు ఉన్న దర్శకులు అందరూ మామూలుగా రెగ్యులర్ సినిమాలను డైరెక్ట్ చేసారు. కని సింగీతం గారు ‘సన్ ఆఫ్ అల్లాదీన్’ అనే ఒక యానిమేషన్ సినిమాని కూడా డైరెక్ట్ చేసారు. ఇలాంటి సినిమా ప్రయత్నం చేయాలంటే ఒక డైరెక్టర్ కి టెక్నికల్ గా కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. మనకు ఏం తక్కువ.. ఇది కూడా చేయగాలం అని యానిమేషన్ మూవీని డైరెక్టర్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసారు. ఈ సినిమాలో 125 అక్షరాలు గ్రాఫికల్ గా ఎంతో అద్భుతంగా ఉన్నాయి మనకి. ఈ మూవీ ని చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించారు.
గటోత్కచ్
ఇది కూడా యానిమేషన్ చిత్రం యే. అప్పటి ‘మాయాబజార్’కి అసిస్టెంట్ డైరెక్టర్ గా సింగీతం గారు చేసారు అని మనం తెలుసుకున్నాం. మరి అందులో ప్రధాన పాత్ర ఎవరు అంటే ఏమని చెప్తారు..? అవును.. ఘటోత్కచుడు. అదే ఘటోత్కచుడి క్యారెక్టర్ ని యానిమేషన్ గా చూపించారు ఈ సినిమాలో. ఆ క్యారెక్టర్ ని మెయిన్ థీమ్ గా తీసుకుని సింగీతం గారు ఈ యానిమేషన్ సినిమాని డైరెక్ట్ చేసారు అన్న మాట. ఎంత యాదృచ్చికం కదా.!
సింగీతం గారూ.. మీ విజన్ కి, సినిమాలు పై ఉన్న మీ డెడికేషన్ కి, మీ డేర్ అటెంప్ట్స్ కి, మీ టాలెంట్ కి విల్లు. మీ లాంటి డైరెక్టర్ ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.
Also Read : ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన రానా భార్య..!