Home » ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన రానా భార్య..!

ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన రానా భార్య..!

by AJAY
Ad

సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త విష‌యాలు అంటే జ‌నానికి మామూలు మోజు ఉండ‌దు. ముఖ్యంగా బ్యాచిల‌ర్స్‌, ల‌వ్ ఎఫైర్స్‌, పెళ్లి ఇలా మొద‌లు పెళ్లి జ‌రిగిన త‌రువాత వారి వైవాహిక జీవితం, ఎఫైర్స్‌, విడాకులు, ప్రెగ్నెన్సీ, పిల్ల‌లు ఇలా ప్ర‌తి విష‌యంపై ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో అయితే సెర్చ్ చేసే వారి సంఖ్య భారీగానే పెరిగింది. ఈ త‌రుణంలో టాలీవుడ్ హీరో ద‌గ్గుబాటి రానా తండ్రి కాబోతున్నారా..? అనే విష‌యం ఓ క్లారిటీ వ‌చ్చింది.

 


2020 ఆగ‌స్టు 08న త‌న ప్రేయ‌సి మిహిక బ‌జాజ్‌ను వివాహం చేసుకున్నాడు రానా. కుటుంబ పెద్ద‌లు,స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే అంగ‌రంగ వైభ‌వంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ జోడీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ప్రేమ ప‌క్షులిద్ద‌రినీఅలా చూసి మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అంటూ తెలుగు ప్రేక్ష‌కులు కితాబిచ్చారు. దీంతో టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో ఈ బ్యూటిపుల్ జోడీ నిలిచింది. ఈ ఇద్ద‌రూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరి పెళ్ల జ‌రిగి దాదాపు రెండేండ్లు కావ‌స్తున్న రానా భార్య మిహిక పెళ్ల‌ప్ప‌టితో పోల్చితే కాస్త బొద్దుగా మార‌డ‌తో అంద‌రిలో ప‌లు అనుమానాలు షురూ అయ్య‌యి.

Advertisement

Advertisement


మిహిక ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అయిందేమో అనే టాక్ బ‌య‌ట వినిపిస్తోంది. ఈ త‌రుణంలో తాజాగా ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా చిన్న క్లారిటీ ఇచ్చింది. నాకు చాలా క్యూరియా సిటీగా ఉంది మేడం. అందుకే అడుగుతున్నా మీరు ప్రెగ్నెంటా..? అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌డంతో వెంట‌నే రియాక్ట్ అయిన మిహిక నో, నో అది మ్యారేజ్ వెయిట్ అని రిప్లై ఇచ్చింది. ఇలా త‌మ‌పై వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ పెట్టేసింది మిహిక‌. ఇక రానా వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విరాట‌ప‌ర్వం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రానా, సాయిప‌ల్ల‌వి, న‌టించ‌గా. హోరోయిన్ ప్రియ‌మ‌ణి ఓ కీలక పాత్ర పోషించింది. త్వర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది.

Also Read : అప్ప‌ట్లో చిరంజీవి పై విష ప్ర‌యోగం….టాలీవుడ్ ను కుదిపేసిన వార్త‌…!

Visitors Are Also Reading