దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. తరుచూ ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కానీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదనే చెప్పవచ్చు. తాజాగా అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదలో ఏకంగా 10కి పైగా భక్తులు మరణించారు.
Advertisement
Advertisement
ఈసంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే.. గురువారం ఉదయం సమయంలో ప్రమాదం సంభవించినది. కరీంగంజ్ జిల్లా అస్సాం-త్రిపుర జాతీయ రహదారిపై ఓ ఆటోను సిమెంట్ లారీ ఢీ కొట్టినది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళలు, యువతులు, చిన్నారులు ఎక్కువగా ఉండడం గమనార్హం. వీరందరూ ఛత్ పూజ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు ముఖ్యమంత్రి బిశ్వశర్మ.