వరల్డ్ కప్ లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు. ప్రపంచకప్ రసవత్తరంగా సాగనుంది. భారత్ కప్ గెలిచి పుష్కరకాలం గడిచింది. రోహిత్ సారధ్యంలో ఈసారి టీమిండియా బరిలోకి దిగబోతోంది. తాజాగా బీసీసీఐ టీమ్ ఇండియా తుది జట్టును కూడా ప్రకటించింది. దీంతో బీసీసీఐ మీద అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలక్షన్ సరిగ్గా లేదని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
తిలక్ వర్మ, సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇక టీమిండియా ఇంపాక్ట్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కు ఆసియాకప్ లో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో గ్యారెంటీగా చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అతనికి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కని యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement
టాలెంట్ ఉన్నోడు ఎక్కడైనా ఆడగలడు. వరల్డ్ కప్ లో తనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇతర దేశాల తరఫున ఆడడానికి సిద్ధమవుతున్నాడు. చాహల్ ఇంగ్లాండ్ కౌంటిలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2023 కౌంటీ ఛాంపియన్షిప్ ఆఖరి మూడు మ్యాచుల్లో కెంట్ క్రికెట్ క్లబ్ కు చాహల్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు సమాచారం. కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ చాహల్ కు ఎన్ఓసి కూడా ఇచ్చింది. కాగా చాహల్ ఎక్స్ స్పిన్నర్ గా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. స్పిన్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి
MS Dhoni : ఇదేం క్రేజ్ బ్రో.. ఏకంగా ట్రంప్ తోనే ధోని ఆటలు
Venu Swamy : టాలీవుడ్ లో హీరోయిన్ చనిపోబోతుంది…వేణుస్వామి సంచలనం !
Kangana Ranawat : రోజా అంటే నాకు తెలియదంటున్న కంగానా… కౌంటర్ ఇచ్చిన రోజా ?