ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్ లలో కెప్టెన్ రోహిత్ శర్మా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత… ఈ లాంగ్ ఫార్మాట్ లో కోహ్లీ నాయకునిగా తప్పుకుంటే.. ఆ బాధ్యతలు బీసీసీఐ రోహిత్ కు అప్పగించింది. కానీ రోహిత్ కు ఫిట్నెస్ సమస్యలు ఎక్కువ. కాబట్టి అతను ఎక్కువ రోజులు టెస్టుల్లో కెప్టెన్ గా ఉండలేదు. అందువల్ల ఇప్పటి నుండే కొత్త టెస్ట్ కెప్టెన్ ను సిద్ధం చేసుకోవాలని భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు.
Advertisement
యువీ మాట్లాడుతూ… రోహిత్ తర్వాత భారత టెస్టు జట్టును నడపగలిగేవాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక్కడే. కాబట్టి అతడిని కెప్టెన్ చేసి.. ఇప్పటి నుండే తయారు చేసుకోవాలి. తనలో కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే టెస్ట్ జట్టులో తన స్థానాన్ని పంత్ స్థిరం చేసుకున్నాడు. అందువల్ల అతడినే కెప్టెన్ చేయాలి. కానీ ఫలితాలు వెంటనే ఆరాధించకూడదు.
Advertisement
ధోని టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత కూడా నెమ్మదిగా కుదురుకున్నాడు. తర్వాత అద్భుతాలు చేసాడు. పంత్ కూడా అలానే చేస్తాడు. కాకపోతే పంత్ ను కాఫ్టన్ చేసి ఒక్క ఏడాది గమనించాలి. వేంటనే అతను ఏమో సాధించాలని అనుకోకూడదు. తనకు కొంత సమయం ఇవ్వాలి. కోహ్లీ కెప్టెన్ అయినప్పుడు కూడా తనకు అంత మెచ్యూరిటీ లేదు అని చెప్పాడు. పంత్ కూడా అలానే.. మెల్లిగా తన మెచ్యూరిటీని పెంచుకుంటాడు అని యువీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
పాకిస్థాన్ లో మెగాస్టార్ క్రికెట్ లీగ్..!