ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికీ.. మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు.. హాట్ టాపిక్ గానే ఉంది. 2019 సంవత్సరంలో ఈ కేసు జరుగగా.. ఇప్పటికీ నిందులు ఎవరో అధికారులు తేల్చలేకపోయారు. ఇక ఇప్పటి వరకు అయితే.. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలుగురిని అరెస్ట్ చేశారు. అయితే..మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు.. తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేక కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించారు సిబిఐ అధికారులు.
Advertisement
గతంలో ఈ కేసులో వైఎస్ షర్మిల చెప్పిన మాటలను ఇప్పుడు సీబీఐ అధికారులు తీసుకున్నారు. రాజకీయ కోణంలోనే ఈ హ** జరిగిందని..ఈ హ** కు పెద్ద కారణమే ఉందని గతంలో షర్మిల పేర్కొన్నారు. అవినాష్ కుటుంబానికి వివేకానంద రెడ్డి వ్యతిరేకంగా ఉండడమే హ** కి కారణం కావచ్చు అని షర్మిల స్టేట్మెంట్ ఇచ్చారు. వారి దారికి వివేకా నందారెడ్డి అడ్డొస్తున్నాడని హ** చేసి ఉండవచ్చు, హ** కు కొన్ని నెలలు ముందే వివేకా బెంగళూరులో మా ఇంటికి వచ్చారని షర్మిల పేర్కొన్నారు.
Advertisement
కడప ఎంపీగా పోటీ చేయాలని మా చిన్నాన్న వివేకా నన్ను అడిగారని తెలిపారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయవద్దని వివేకా కోరుకున్నారు, నాకు తెలిసి హ** కు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అందరూ సన్నిహితులే కారణం అంటూ వ్యాఖ్యనించిందట. కుటుంబంలో అందరం బాగున్నట్లు బయటికి కనిపించిన లోపల కోల్డ్ వార్ నడిచేదని.. గత ఏడాది అక్టోబర్ 7న ఢిల్లీలో సీబీఐ కి వాంగ్మూలమిచ్చిదట షర్మిల. ఇప్పుడు అదే వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించారు సిబిఐ అధికారులు. దీంతో ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబానికి ఉచ్చు బిగిసుకుంటోంది.
ఇవి కూడా చదవండి
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్
MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !
వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?