స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం గోవాలో ఘనంగా జరిగింది. మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఈ ప్రేమ జంట. సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలోని ఓ రిసార్ట్ లో జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రకుల్ భగ్నానీ జంట గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లికి సంబంధించి ఫొటోలు వైరల్ గా మారాయి.
Advertisement
Advertisement
ఈ నెల 19న హల్దీతో మొదలైన వీరి వివాహ వేడుకలు.. మెహందీ, సంగీత్ వేడుకలతో సందడిగా మొదలైంది. ఆ తర్వాత బుధవారం 21న ఈ జంట మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. రెండు పద్ధతుల్లో ఈ జంట వివాహం జరిగింది. ముందుగా సిక్ సంప్రదాయంలో వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత సింధీ సంప్రదాయంలో కూడా చేసుకున్నారు. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్లో కన్నుల పండుగగా జరిగిన వీరి వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా హాజరయ్యారు. రకుల్ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.. డాన్స్ చేసి.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, ఆలియా భట్, అనన్య పాండే, అక్షయ్ కుమార్ దంపతులు, టైగర్ ష్రాఫ్ ప్రముఖులు సందడి చేశారు.
Also Read : మరోసారి రామ్ గోపాల్ వర్మ వ్యూహం వాయిదా..!